రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కంటెంట్ బేస్డ్గా రూపొందిన చిత్రం 'ఆటగదరా శివ'
Send us your feedback to audioarticles@vaarta.com
'పవర్', 'లింగా', 'బజరంగీ భాయీజాన్' వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం 'ఆటగదరా శివ'. రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. 'ఆ నలుగురు', 'మధు మాసం', 'అందరి బంధువయ'తో ప్రేక్షకుల భావోద్వేగాలను స్పృశించిన సెన్సిటివ్ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉదయ్ శంకర్ కథానాయకుడు. ఈ నెల 20న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
హీరో ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ "రాక్‌లైన్ వెంకటేశ్ టాప్ ప్రొడ్యూసర్. హిందీ, మలయాళం, బెంగాలీ, తెలుగు, తమిళ్, కన్నడలో సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయన డ్రీమ్ వెంచర్ ఈ సినిమా. చంద్రసిద్ధార్థ్ గారి గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు.
ఆయన డైరక్షన్లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. దొడ్డన్నగారు కన్నడలో చాలా పెద్ద స్టార్. నేను హైపర్ ఆదికి ఫ్యాన్‌ని. జబర్దస్త్ లో ఆయన స్కిట్స్ చాలా చూస్తాను. కెమెరా యాంగిల్స్ చాలా బావున్నాయి" అని అన్నారు.
హైపర్ ఆది మాట్లాడుతూ "ఆ నలుగురిని టీవీలో చాలా మంది చూశారు. అలా ఆ సినిమాను అక్కడ చూసిన వారు ఆటగదరా శివను థియేటర్లలో చూస్తే చాలు. ఈ చిత్రంలో హీరో పక్కన కూడ ఎవరూ లేరు. కానీ నా పక్కన ఓ అమ్మాయి నటించింది. దొడ్డన్నగారు కన్నడలో 600లకి పైగా సినిమాలు చేశారు. షాట్ స్టార్ట్ అనగానే చాలా సీరియస్‌గా మారిపోయేవారు" అని చెప్పారు.
చంద్రసిద్ధార్థ్ మాట్లాడుతూ "నిరాసకత్తతలో ఉండి, ఇక సినిమాలు ఏం చేస్తాం అని అనుకుంటున్న సమయంలో ఒకసారి 'ఆటగదరా శివ'ను విన్నాను. తనికెళ్ల భరణిగారు రాసిన ఆ పాట వింటున్నప్పుడు నాకు అది టైటిల్‌గా బావుంటుందని అనిపించింది. మరుసటిరోజే రాక్‌లైన్ వెంకటేశ్‌గారు ఈ సినిమా గురించి చెప్పారు. నాక్కూడా రోడ్ ఫిల్మ్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. సరేనని అంగీకరించాను.
కన్నడ సినిమాకు స్పిరిచువల్ యాంగిల్‌ని, ఇంకో లేయర్‌ని కలగలిపి కథ సిద్ధం చేసుకున్నాం. పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు చేయాలి. పెద్ద హీరోలు చిన్న దర్శకులతో సినిమాలు చేయాలి... అప్పుడే పరిశ్రమ బావుంటుందని నా ఫీలింగ్. అలాంటి బ్యాలన్స్ ఎప్పుడైనా బావుంటుందని నా నమ్మకం. ఆ రకంగా ఈ సినిమా చేశాను. ఈ సినిమాలోనే ఓ డైలాగ్ ఉన్నట్టు భయం అనేది ఫ్లాప్‌ని తప్పించదు.
హిట్‌ని దక్కించదు అన్నట్టు ఈ సినిమా చేశాను. స్తానికులు కూడా ఈ సినిమా నిర్మాణంలో చాలా సాయం చేశారు. పంచభక్ష పరమాణ్నాలను చూడగానే ఎవరికైనా నచ్చుతాయి. ఎవరైనా ఇట్టే ఇష్టపడి తింటారు. అయితే ఈ సినిమా రాగిముద్దలాంటి సినిమా. అయినా మా నటీనటులు దాన్ని తినిపించేలా చేశారు.
రిజల్ట్ గురించి భయపడనవసరం లేకుండా చేసిన సినిమా ఇది. ఎందుకంటే మార్కెట్లో ఉన్న ఇతరత్రా సినిమాలను మనం చేయడం ఎందుకు? టిక్కెట్ కొని చూస్తే సరిపోతుంది కదా.. 'ఆటగదరా శివ' వంటి సినిమాలను అటెంప్ట్ చేసినప్పుడే నాకు శాటిస్ఫేక్షన్ ఉంటుంది. సినిమాలో ప్యూరిటీ ఉంది. మంచి ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చిన సినిమా ఇది" అని అన్నారు.
దొడ్డన్న మాట్లాడుతూ "తెలుగులో నాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అయినా నేను వేటినీ చేయలేదు. నేను కర్ణాటకలో చాలా బిజీ. అప్పుడు తెలుగులో సినిమాలు చేస్తానంటే రెంటికీ చెడ్డ రేవడి అవుతావు అని చాలా మంది హెచ్చరించారు. అయితే ఇప్పుడు సినిమా చేయడానికి ఆ శివుడే సాయం చేశారు. ఆ నలుగురు మంచి సబ్జెక్ట్. ఈ సినిమాలో నేను కోట శ్రీనివాసరావుగారిలాంటి పాత్ర చేశాను.
రాక్లైన్గారు సినిమా చేశారంటే ఆయనకు కథ నచ్చాలి. అప్పుడే చేస్తారు. బిజాపూర్ నుంచి షోలాపూర్ వరకు నేషనల్ హైవే మీద ఓపెన్ ప్లేస్‌లో చేశాం. 42-43 డిగ్రీల మధ్య చేసిన ఈ సినిమాను మర్చిపోలేను. అయితే అంత కష్టం కూడా ఈ సినిమాను చూడగానే మర్చిపోయాను. నాకు ఓవర్ యాక్షన్ నచ్చదు. ఏదైనా నేచురల్‌గా ఉండాలనే అనుకుంటాను. ఈ సినిమాకు ఆరు నెలలు గడ్డం పెంచాను" అని చెప్పారు.
రాక్‌లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ "ఆటగదరా శివ తెలుగులో చేయాలన్నది నా సంకల్పం. రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాగా ఈ సినిమా రూపొందింది. అన్ యూజువల్ కథతో ఉన్ సినిమా ఇది. నిర్మాతగా సెల్ఫ్ శాటిఫేక్షన్ని ఇచ్చింది. ఆ నలుగురును కన్నడలో విష్ణువర్ధన్తో తీశాను నేను.
అప్పటి నుంచి చంద్రసిద్ధార్థగారు తెలుసు. ఈ సినిమాకు ఆయనైతే బావుంటుందనిపించింది. అడగ్గానే ఆయన చేసినపెడతానని అన్నారు. ఎలాంటి ఇమేజ్ లేని నటీనటుల్ని మేం ఈ సినిమాకోసం ఎంపిక చేసుకున్నాం. హైపర్ ఆది కూడా అలాంటి వ్యక్తి. తను ఎస్టాబ్లిష్డ్ కమెడియన్ కాదు కాబట్టి ఈ పాత్రలో చక్కగా ఒదిగాడు. వాసుకి మంచి సంగీతాన్నిచ్చారు. ఇది చిన్న సినిమా. కానీ ప్రేక్షకులు చూసి పెద్ద చిత్రంగా ఆశీర్వదించాలి" అని అన్నారు.
దొడ్డన్న, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి, దీప్తి కీలక పాత్రలు పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com