ఆడియోన్స్ ని ఎంటర్ టైన్ చేయడం కోసం తీసిన సినిమా ఆటాడుకుందాం రా..!
Saturday, August 20, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సుశాంత్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆటాడుకుందాం రా..! అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీనాగ్ కార్పోరేషన్, శ్రీజి ఫిల్మ్స్ బ్యానర్స్ పై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగ సుశీల సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 19న ఆటాడుకుందాం రా చిత్రం రిలీజై మంచి ఓపెనింగ్స్ సాధించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ....అన్ని ఏరియాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. థియేటర్ కి వచ్చిన ఆడియోన్స్ నవ్వుతూ బయటకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రం తీసాం. ముఖ్యంగా బ్రహ్మానందం & టైమ్ మిషన్ ఎపిసోడ్ ను ధియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కామెడీగా ఉన్న పోసాని విలనిజం కూడా ఆడియోన్స్ ను బాగా ఆకట్టుకుంటుది. ఇక కథ విషయానికి వస్తే...మనిషి మనిషిని మోసం చేయకూడదు అనేదాన్ని ఎంటర్ టైనింగ్ గా చెప్పాం.. హీరో సుశాంత్ ఈ చిత్రంలో చాలా స్టైలీష్ గా కనిపించాడు. ఏమాత్రం రాజీపడకుండా చింతలపూడి శ్రీనివాసరావు గారు ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా తీసారు. ఈ చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్స్ అన్నారు.
రైటర్ శ్రీధర్ సీపాన మాట్లాడుతూ... కథ రాసేటప్పుడే కొత్తగా చెప్పాలని.. టైమ్ మిషన్ ఎపిసోడ్ ప్లాన్ చేసాం. సుశాంత్ కథ విన్న 15 నిమిషాలకే ఓకే చెప్పాడు. రాజమౌళి ఎపిసోడ్ ను ఆడియోన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సుశాంత్ తర్వాత ఈ చిత్రానికి బలం అంటే బ్రహ్మానందం. సుశాంత్ డ్యాన్స్ చాలా బాగా చేసాడు. నేను ఇప్పటి వరకు 25 చిత్రాలకు వర్క్ చేసాను. నన్ను పరిచయం చేసిన మా గురువు నాగేశ్వరరెడ్డి గారి సినిమాకి వర్క్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ.... ఆటాడుకుందాం రా క్లాసిక్కో ట్రెండ్ సెట్ ఫిల్మో కాదు....ఆడియోన్స్ ని ఎంటర్ టైన్ చేయడం కోసమని తీసిన సినిమా. మాస్ కోసం కాళిదాసు, యూత్ కోసం కరెంట్, అడ్డా తీస్తే ఫ్యామిలీ ఆడియోన్స్ కోసం ఈ సినిమా తీసాం. ఆటాడుకుందాం రా కొత్త ఎనర్జిని ఇచ్చింది. పల్లెకుపోదాం....సాంగ్ & టైటిల్ సాంగ్ లో అఖిల్ వచ్చినప్పుడు ఆడియోన్స్ లో ఎనర్జి వచ్చింది. బ్రహ్మానందం గారు కనిపించినప్పుడల్లా ఆడియోన్స్ నవ్వుతూనే ఉన్నారు. చైతన్య అతిధిపాత్ర ఆకట్టుకుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత నాగ సుశీల మాట్లాడుతూ.... ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి దేవి ధియేటర్ లో చూసాం. ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సుశాంత్ బాగున్నాడు అని అందరూ చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న అక్కినేని అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అన్నారు.
నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.... ఆటాడుకుందాం రా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు ఆదివారం నుంచి ధియేటర్లను సందర్శించనున్నాం. వైజాగ్, విజయవాడ, తిరుపతిలో ధియేటర్లో ప్రేక్షకులను కలవనున్నాం.మా సంస్థలో ఆటాడుకుందాం రా పెద్ద సినిమా. ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. సుశాంత్ అద్భుతంగా నటించాడు. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధ్యాంక్స్ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments