ఆటాడుకుందాం రా ఒక పండగ లాంటి సినిమా - చింతలపూడి శ్రీనివాసరావు
Send us your feedback to audioarticles@vaarta.com
కాళిదాసు, కరెంట్, అడ్డా...చిత్రాలతో ఆకట్టుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ఆటాడుకుందాం రా. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగ సుశీల సంయుక్తంగా నిర్మించారు. పుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఆటాడుకుందాం రా చిత్రాన్ని ఈనెల 19న రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ....ఈ చిత్రంలో సుశాంత్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు. అనూప్ అందించిన ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఈ చిత్రానికి ఓ హైలెట్ గా నిలుస్తుంది. శ్రీధర్ సీపాన కథను మూడు నిమిషాల్లో చెప్పాడు. ఆ మూడు నిమిషాల్లోనే కథ ఎంతగానో నచ్చింది. డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి కూడా ఓ కథను రెడీ చేసారు. అయితే...శ్రీధర్ సీపాన కథ విన్న తర్వాత నాగేశ్వరరెడ్డి గారు నా కథ కంటే ఈ కథ బాగుంది అనడంతో శ్రీధర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇక టైటిల్ విషయానికి వస్తే...ఈ కథకు ఆటాడుకుందాం రా అనే టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది. ఆటాడుకుందాం రా అనే సాంగ్ లోనే అఖిల్ సుశాంత్ తో కలిసి డ్యాన్స్ చేసాడు.
అలాగే చైతన్య కథను మలుపు తిప్పే ముఖ్యపాత్రలో కనిపిస్తాడు.బ్రహ్మానందం, పృథ్వీ, పోసాని, మురళీశర్మ..తదితరులు చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. టైమ్ మిషన్ సెట్ చాలా రిచ్ గా ఉంటుంది. అలాగే టైమ్ మిషన్ ఎపిసోడ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే...ఆటాడుకుందాం రా అభిమానులకు ఒక పండగ లాంటి సినిమా అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout