సెన్సార్ పూర్తి చేసుకున్న'ఆటాడుకుందాం..రా

  • IndiaGlitz, [Thursday,August 11 2016]

సుశాంత్‌ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీ నాగ్‌ కార్పోరేషన్‌, శ్రీ జి ఫిలింస్‌ పతాకాలపై జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న 'ఆటాడుకుందాం.. రా'లో యువసామ్రాగ్‌ నాగచైతన్య, అక్కినేని అఖిల్ స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌వ‌డంతో సినిమా ఆగ‌స్ట్ 19న విడుద‌ల కావ‌డం లాంచ‌న‌మైంది. కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలో టైమ్ మిష‌న్ అనే కాన్సెప్ట్‌తో బ్ర‌హ్మానందం కామెడి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించ‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌యూనిట్ తెలియ‌జేస్తుంది.