బ్రేకింగ్: విడిపోయిన అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు.. షాక్ లో బాలీవుడ్
Send us your feedback to audioarticles@vaarta.com
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ జీవితంలో ఊహించని పరిణామం ఎదురైంది. దాదాపు 15 ఏళ్లపాటు అన్యోన్యంగా జీవితం సాగించిన అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు విడాకులతో విడిపోయినట్లు ప్రకటించారు. ఈ మేరకు అమీర్ ఖాన్, కిరణ్ రావు చేసిన ఉమ్మడి ప్రకటన బాలీవుడ్ వర్గాలని షాక్ లో ముంచేసింది.
ఇదీ చదవండి: వైజాగ్ రామానాయుడు స్టూడియోపై కన్ను.. సురేష్ బాబుపై రాజకీయ ఒత్తిళ్లు?
వీరి తాజా నిర్ణయంతో అమీర్ ఖాన్ అభిమానులు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. 'ఈ 15 ఏళ్ళు మా జీవితంలో ఎన్నో జ్ఞాపకాలని మిగిల్చింది. నమ్మకం గౌరవం, ప్రేమతో మేమిద్దరం జీవితంలో సంతోషాలని పంచుకున్నాం. ఇకపై మేము భార్యాభర్తలుగా ఉండబోవడం లేదు. మేమిద్దరం వేరు వేరుగా మా జీవితాలని ప్రారంభించబోతున్నాం. కానీ మా పిల్లలకు తల్లిదండ్రులుగా కొనసాగుతాం.
మేమిద్దరం విడిపోవాలని చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నాం. ఇప్పుడే అధికారికమైన ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. మాకు సన్నిహితుల, కుటుంబ సభ్యుల నుంచి బ్లెస్సింగ్స్ కావాలి. ఇది మా జీవితాలకు ఎండ్ అని భావించవద్దు.. ప్రారంభం అనుకోండి' అంటూ అమీర్ ఖాన్, కిరణ్ రావు ఉమ్మడిగా తమ విడాకులని ప్రకటించారు.
అమీర్ ఖాన్, కిరణ్ రావులు 2005 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఆజాద్ రావు ఖాన్ సంతానం. ఇది కిరణ్ రావుతో అమీర్ ఖాన్ ది రెండో వివాహం. అంతకు ముందు ఈ విలక్షణ నటుడు తన తొలి భార్య రీనా దత్త నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. అమీర్, కిరణ్ రావులు ఎలాంటి విభేదాలతో విడిపోయారనేది ఇప్పటికైతే సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com