లడాఖ్ షూట్ లో నేను, నాగ చైతన్య ఎంజాయ్ చేసింది ఇలాగే: అమీర్ ఖాన్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా. దర్శకుడు అద్వైత్ చందన్ ఈ చిత్రాన్ని ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీ గా తెరకెక్కిస్తున్నారు. వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
సెకండ్ వేవ్ ప్రభావం తగ్గాక కొన్నివారాల క్రితమే ఈ చిత్ర షూటింగ్ లడాఖ్ లో తిరిగి ప్రారంభం అయింది. అద్వైత్ చందన్ ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చైతు అమీర్ ఖాన్ స్నేహితుడిగా ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు.
చైతు, అమిర్ ఖాన్, కిరణ్ రావు లు కలసి ఉన్న షూటింగ్ లొకేషన్ పిక్ ఆ మధ్యన బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల లడాఖ్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా అక్కడి లోకల్ మీడియాతో అమిర్ ఖాన్ ముచ్చటించారు. లడాఖ్ లో తన షూటింగ్ అనుభవాలని పంచుకున్నారు.
'ఇక్కడి సౌకర్యాలు బావున్నాయి. హోటల్స్ సౌకర్యం బావుంది. ఇక్కడ షూటింగ్ చేయడం కొత్త ఎక్స్పీరియన్స్. మరిన్ని వివరాలు కిరణ్ రావు చెబుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకుంది. అవును ఇక్కడ మౌలిక సదుపాయాలు బావున్నాయి. రవాణా సౌకర్యం, ఇతర అవసరాల విషయంలో మేము ఎలాంటి ఇబ్బందులు పడలేదు. రోడ్స్ చాల బావున్నాయి.
దీనిపై అమీర్ ఖాన్ వెంటనే స్పందించాడు. అవును రోడ్స్ బావుండడంతో మా జర్నీ స్మూత్ గా సాగింది. హోటల్ నుంచి షూటింగ్ లొకేషన్ కి చేరుకోవడానికి గంట సమయం పడుతుంది. నేను, నాగచైతన్య కలసి ఒకే కారులో లొకేషన్ కు వచ్చేవాళ్ళం. కారు జర్నీలో ఇక్కడి ప్రకృతి అందాలని చాలా బాగా స్వాదించాం.
అందమైన లొకేషన్స్ గురించి నేను, చైతూ రోజూ మాట్లాడుకునే వాళ్ళం. అలా మేమిద్దరం లడాఖ్ షూటింగ్ డేస్ ని ఎంజాయ్ చేసినట్లు అమీర్ ఖాన్ తెలిపాడు. సినిమాల్లో ప్రతిభగల వారందరికీ అవకాశాలు ఉంటాయని.. లడాఖ్ యువత చిత్ర పరిశ్రమలోకి రావాలని అమీర్ ఖాన్ పిలుపు ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com