ఏడాది వెనక్కి వెళ్లిన ఆమిర్ ఖాన్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ కారణంగా సినిమా రిలీజ్‌లు వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు ఈ కోవలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ కూడా చేరింది. హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’కు ఇది రీమేక్. ఆమిర్‌ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు చేసే ఆమిర్‌ఖాన్ పాత్ర కోసం ఎంతటి రిస్క్ చేయడానికైనా వెనకాడరు. ఈ రీమేక్‌ను అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కేవలం పాత్ర కోసం బరువు తగ్గడమే కాదు.. వయసుని పట్టించుకోకుండా ఆమిర్ రిస్కీ సీన్స్‌లో నటించారు. ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ ప్లాప్ కావడంతో ఆమిర్ ఖాన్ ఈ సినిమాను చాలా కేర్ తీసుకుని, ఛాలెంజింగ్‌గా చేస్తున్నారట ఆమిర్. ఇందులో ఆమిర్ అథ్లెట్ పాత్రలో నటిస్తున్నారు.
నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వల్ల మరో ఏడాది పాటు సినిమా విడుదలను వాయిదా వేస్తునట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రీతమ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కానుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments