వెబ్ సిరీస్‌లో అమీర్ ఖాన్‌...

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

ప‌లు వివాదాల‌కు కేంద్ర బిందువుగా నిలిచిన ఓషో 1990లో క‌న్నుమూశారు. ఈయ‌న జీవిత చ‌రిత్ర‌ను ఓ వెబ్ సిరీస్ రూపంలో అందించడానికి ఓ అంత‌ర్జాతీయ ఛానెల్ రెడీ అయిన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇందుకోసం శ‌కున్ బ‌త్రా స్క్రిప్ట్ అందించారు.

ఇందులో న‌టించ‌డానికి బాలీవుడ్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నాడ‌ట‌. వైల్డ్ వైల్డ్ కంట్రీ పేరుతో్  రూపొందించిన ఓషో డాక్యుమెంట‌రీ సిరీస్ సూప‌ర్ హిట్ కావ‌డంతో బాలీవుడ్‌లో ఈ వెబ్ సిరీస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ప్ర‌స్తుతం అమీర్‌ఖాన్ థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌లో న‌టిస్తున్నారు.