స్టార్ హీరో డాటర్ ఇంట్రస్టింగ్ లవ్‌స్టోరీ!
- IndiaGlitz, [Friday,June 14 2019]
స్టార్ హీరో డాటర్ ఓ మ్యూజీషియన్‌తో ప్రేమలో ఉందట . ఎవరో టక్కున చెప్పండి చూద్దాం అని అడిగితే నూటికి 99 మంది శ్రుతిహాసన్ పేరే చెబుతారు. అయితే ఆమె కాకుండా మరొకరిని చెప్పమంటే మాత్రం ఆలోచనలో పడతారు. ఇక అలాంటి ఆలోచనలు ఏమీ అవసరం లేదు.
ఎందుకంటే ఆమెకు ఓ తోడు దొరికేశారోచ్. తాజాగా మ్యూజీషియన్‌తో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించిన నటి అమీర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్. ఇటీవల ఇన్‌స్టాలో క్వశ్చన్ సెక్షన్ కంప్లీట్ చేసిన ఐరా అప్పుడే ఈ విషయాన్ని వెల్లడించింది. అతను మరెవరో కాదు మిషాల్ కిర్పలానీ. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య ఏదో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఐరా బాహాటంగా ఆ విషయాన్ని ప్రకటించడంతో అసలు ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పోయింది.