'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' అన్ని సెక్షన్స్ ఆడియన్స్ కీ నచ్చుతుంది - ఆలూరి సాంబశివరావు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి, తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. స్థిరాస్తి రంగంలో ప్రవేశించి అందులో రాణించారు. నాలుగేళ్ల క్రితం ఆలూరి క్రియేషన్స్ బ్యానర్ పై 'చెంబు చిన సత్యం' చిత్రంతో నిర్మాతగా మారిన ఆయన పేరు ఆలూరి సాంబశివరావు. తాజాగా 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' చిత్రాన్ని నిర్మించారు.
ప్రముఖ నటి ఆమని ముఖ్య పాత్రలో.. శరత్ చంద్ర-నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్స్ గా.. శ్రీనివాస్ రెట్టాడి దర్శకత్వంలో ఆలూరి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' ఈనెల (జూన్) 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని.. చిత్ర నిర్మాత, ఆలూరి క్రియేషన్స్ అధినేత ఆలూరి సాంబశివరావు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
"నిర్మాతగా నా తొలి చిత్రం 'చెంబు చినసత్యం' నన్ను తీవ్రంగా నిరాశ పరిచింది. ఆర్ధికంగానూ నష్ట పరిచింది. ఆ సినిమా నేర్పిన పాఠాలతో ఇప్పుడు రెండు సినిమాలు నిర్మిస్తున్నాను. 'నేనే ముఖ్య మంత్రి' అనే సినిమా కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది.
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' విషయానికి వస్తే.. మహిళల రక్షణ కోసం మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఓ సెక్షన్ ని కొందరు మహిళలు ఎలా దుర్వినియోగపరుచుకుంటున్నారు అనే అంశాన్ని తీసుకొని దానికి పుష్కలమైన వినోదాన్ని జోడించి తెరకెక్కించిన చిత్రమిది. ఆలోచింపజేస్తూనే వినోదాన్ని పంచుతుంది. కథను డ్రైవ్ చేసే ఒక మంచి పాత్రలో ఆమని నటించారు. ఈ చిత్ర ద్వారా హీరోగా పరిచయమవుతున్న శరత్ చంద్రకు ఈ చిత్రంతో చాలా మంచి పేరు వస్తుంది.
హీరోయిన్ నేహా దేశ్ పాండే, మధునందన్, వాసు ఇంటూరి, రాగిణి తదితరుల పాత్రలు కూడా అందరినీ అలరిస్తాయి. విజయ్ కూరాకుల సంగీతం, మౌనశ్రీ మల్లిక్ సాహిత్యం, పింజర్ల శ్యాం ఛాయాగ్రహణం 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' కు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన మా దర్శకుడు రెట్టాడి శ్రీనివాస్ ప్రతి సన్నివేశాన్ని జనరంజకంగా మలిచాడు.
ఈనెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. అదే రోజు మరో ఏడెనిమిది సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే మా సినిమాపై మాకు నమ్మకముంది. మొదటి రోజు సినిమా చూసిన ప్రతి ఒక్కరు మా సినిమాకి బ్రాండ్ అంబాసడర్ గా మారి మా సినిమా చూడమని ప్రతి ఒక్కరికీ చెబుతారు.
ఈ మౌత్ టాక్ ఇలాగే స్ప్రెడ్ అయి.. 'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' మంచి హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. మా బ్యానర్ లో రూపొందుతున్న 'నేనే ముఖ్యమంత్రి' చిత్రాన్ని కూడా రెండు మూడు నెలల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments