'ఆఖరి పోరాటం'కి 30 ఏళ్ళు
Send us your feedback to audioarticles@vaarta.com
అతిలోకసుందరి శ్రీదేవిని హీరో స్థాయిలో చూపించిన చిత్రం 'ఆఖరి పోరాటం'. సిబిఐ ఆఫీసర్ ప్రవల్లిక (శ్రీదేవి).. పేరుబడ్డ నేరస్థుడు అనంతానంత స్వామి (అమ్రీష్ పూరి)ని ఎలా పట్టుకుంది? దానికి స్టేజి ఆర్టిస్ట్ అయిన విహారి (నాగార్జున) ఎలా సాయపడ్డాడు? అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.
యండమూరి వీరేంద్రనాథ్ నవలాధారంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించారు. సుహాసిని, చంద్రమోహన్, అమ్రీష్ పురి, సత్యనారాయణ, జగ్గయ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
శ్రీదేవి కాంబినేషన్‌లోనూ.. అలాగే అశ్వనీదత్ సంస్థలోనూ నాగార్జున తొలిసారిగా నటించిన సినిమా ఇదే కావడం విశేషం. అదే విధంగా బాలీవుడ్ నటుడు అమ్రిష్ పురి తెలుగులో నటించిన మొదటి చిత్రం కూడా ఇదే కావడం విశేషం.
పాటల విషయానికి వస్తే.. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరపరచిన గీతాలన్నీ శ్రోతలను అలరించాయి. అన్ని పాటలకు కూడా వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ముఖ్యంగా బాలీవుడ్ గానకోకిల లతా మంగేష్కర్ ఆలపించిన "తెల్ల చీరకు"పాట ఇప్పటికీ నిత్య నూతనమే.
తిరుపతి, అనంతపూర్, కర్నూల్, ఆదోని, నెల్లూరు సెంటర్లలో ఐదు షోలతో ఏభై రోజులు ఆడిన ఏకైక చిత్రంగా 'ఆఖరి పోరాటం' నిలిచింది . ఈ రోజు వరకు ఆ రికార్డు అలానే ఉండడం విశేషం. మార్చి 12, 1988న విడుదలైన ఈ చిత్రం.. నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments