పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'ఆకతాయి'

  • IndiaGlitz, [Sunday,December 25 2016]

వి.కె.ఎ.ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆశిష్‌రాజ్‌, రుక్సార్ మీర్ హీరో హీరోయిన్లుగా రామ్‌భీమ‌న ద‌ర్శ‌కత్వంలో విజ‌య్ క‌ర‌ణ్‌, కౌశ‌ల్ క‌ర‌ణ్‌, అనిల్ క‌ర‌ణ్ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం 'ఆక‌తాయి'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జరుపుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా....

నిర్మాత‌లు విజ‌య్ క‌ర‌ణ్‌, కౌశ‌ల్ క‌ర‌ణ్‌, అనిల్ క‌ర‌ణ్ మాట్లాడుతూ - '' డైరెక్ట‌ర్ రామ్ భీమ‌న‌గారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమా అవుట్ పుట్ బాగా వ‌చ్చింది. సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేసి జ‌న‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

ద‌ర్శ‌కుడు రామ్‌భీమ‌న మాట్లాడుతూ - ''నిర్మాత‌ల స‌హ‌కారంతో సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా లావిష్‌గా తెర‌కెక్కించాం. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్‌పై రాని విధంగా యాక్ష‌న్ స‌న్నివేశాలను తెర‌పై చూస్తారు. హీరో ఆశిష్ రాజ్ అద్భుతంగా న‌టించారు. సింధూర పువ్వు ఫేమ్ రాంకీ ప‌ది సంవత్స‌రాలు త‌ర్వాత తెలుగులో న‌టిస్తున్న చిత్ర‌మిది. విల‌న్‌గా న‌టిస్తున్న ప్ర‌దీప్ రావ‌త్ న‌ట‌న‌, బ్ర‌హ్మానందం, పోసాని, కృష్ణ‌భ‌గ‌వాన్‌, శ్రీనివాస్‌రెడ్డి, న‌వీన్ నేని కామెడి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీషా ప‌టేల్ స్పెష‌ల్ సాంగ్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ఈ చిత్రంలో వాడిన కొన్ని హాలీవుడ్ టెక్నాల‌జీ షాట్స్‌, మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల్ని చేస్తాయి. ల‌వ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రూపొందిన ఈ చిత్రం నిర్మాణాంత కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రిలో అత్య‌ధిక థియేట‌ర్స్‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

ఆశిష్‌రాజ్‌, రుక్సార్ మీర్‌, సుమ‌న్‌, నాగ‌బాబు, రాంకీ, రాశి, బ్ర‌హ్మానందం, అలీ, ప్ర‌దీఫ్ రావ‌త్‌, పోసాని, పృథ్వీ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో అమీషా ప‌టేల్ స్పెష‌ల్‌సాంగ్ చేశారు. ఈ చిత్రానికి సంగీతంః మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః వెంక‌ట్ గంగ‌దారి, ఆర్ట్ః ముర‌ళి కొండేటి, ఫైట్స్ః నందు, ఎడిట‌ర్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌, డ్యాన్స్ః జానీ మాస్ట‌ర్‌, స్వ‌ర్ణ‌, స‌తీష్‌, అమిత్‌, నిర్మాత‌లుః విజ‌య్ క‌ర‌ణ్‌, కౌశ‌ల్ క‌ర‌ణ్‌, అనిల్ క‌ర‌ణ్‌, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః రామ్ భీమ‌న‌