సెన్సార్ పూర్తి చేసుకొని మార్చి 10న విడుదలకు సిద్ధమవుతున్న 'ఆకతాయి'
Send us your feedback to audioarticles@vaarta.com
ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ లవ్ ఎంటర్ టైనర్ "ఆకతాయి". "రివెంజ్ ఈజ్ స్వీట్" అనేది ట్యాగ్ లైన్. మణిశర్మ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రానికి "యు/ఎ" సర్టిఫికెట్ లభించింది. మార్చి 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ మాట్లాడుతూ.. "యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. మా డైరెక్టర్ రామ్ భీమన చిత్రాన్ని తెరకెక్కించిన విధానం సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అలాగే.. మణిశర్మ నేతృత్వంలో రూపొందిన ఆడియోకు విశేషమైన స్పందన లభించింది. చిత్రానికి కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.
సుమన్, నాగ బాబు, రాంకీ, రాశి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణ మురళి, పృద్వీ, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్, నవీన్ నేని, జెమినీ సురేష్, జబర్దస్త్`టీం, స్పెషల్ సాంగ్: అమీషా పటేల్
ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం : మణిశర్మ, సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగదారి, ఆర్ట్ : మురళి కొండేటి, ఫైట్స్ : నందు, ఎడిటర్ : M.R.వర్మ, డాన్స్ : స్వర్ణ, జాని, సతీష్, అమిత్, స్టిల్స్ : వికాస్, కాస్ట్యూమ్ డిజైనర్ : భాను, కాస్ట్యూమ్స్ : మురళి, మేకప్ : వేణు, కో–డైరెక్టర్ : చల్లపల్లి వెంకటేశ్వర రావు, పబ్లిసిటి డిజైనర్ : అనిల్-భాను, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్ : శ్రీరంగం సతీష్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : మల్లిక్, నిర్మాతలు : K.R విజయ్ కరణ్, K.R కౌశల్ కరణ్, K.R అనిల్ కరణ్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: రామ్ భీమన!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments