'ఆకాశ‌వాణి'లో విల‌న్ ఎవ‌రో తెలుసా....

  • IndiaGlitz, [Saturday,December 15 2018]

'బాహుబ‌లి' తో తెలుగు సినిమాను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌పై కార్తికేయ నిర్మాత‌గా రూపొందిస్తున్న తొలి చిత్రం 'ఆకాశ‌వాణి'. రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు, సింగ‌ర్ కాల‌భైర‌వ ఈ చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుండి ప్రారంభం అవుతుంది. లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో విల‌న్ పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంద‌ట‌.

ఈ పాత్ర‌కు ముందుగా సాయికుమార్ త‌మ్ముడు ర‌విశంక‌ర్ అనుకున్నారు కానీ... ఇప్పుడు మోహ‌న్‌లాల్ అయితే ఎలా ఉంటుందోన‌ని ఆలోచిస్తున్నార‌ట‌. ఒక‌వేళ మోహ‌న్‌లాల్ బోర్డ్‌లోకి వ‌స్తే బ‌డ్జెట్ పెరుగుతుంది. అయితే సినిమాను మ‌ల‌యాళంలో కూడా విడుద‌ల చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ మోహ‌న్‌లాల్ ఒప్పుకోక‌పోతే డా.రాజ‌శేఖ‌ర్‌ను ఆ పాత్ర‌కు అప్రోచ్ కావాల‌నేది యూనిట్ ఆలోచ‌న‌గా క‌న‌ప‌డుతుందని సినీ వ‌ర్గాల స‌మాచారం.

More News

రామ్‌చ‌ర‌ణ్ బాబాయి పాత్ర‌లో త‌మిళ న‌టుడు....

మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఆఫ్ టాలీవుడ్‌గా రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'ఆర్ ఆర్ ఆర్‌' పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

న‌క్స‌లైట్ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి

ఫిదా, ఎంసిఎ వంటి తెలుగు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సాయిప‌ల్ల‌వి తెలుగులో త‌దుప‌రిగా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతుంది.

'96' తెలుగు రీమేక్ లీడ్ యాక్ట‌ర్స్ దొరికేశారా...

విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించిన చిత్రం '96'. వింద్ మీన‌న్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడులైన ట్రైల‌ర్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్‌కి, పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

హ‌రీష్ సినిమాలో మ‌రో హీరో ఎవ‌రంటే...

డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్' త‌ర్వాత సినిమా చేయడానికి చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడ‌నే చెప్పాలి. చేయాల్సిన దాగుడు మూత‌లు కాన్సెప్ట్ న‌చ్చ‌క దిల్‌రాజు

మీ టూ ఎఫెక్ట్‌.. హీరోయిన్‌కి గంట‌కు రెండు ల‌క్ష‌లు

సినీ, రాజ‌కీయ‌, క్రీడా రంగంలోని మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల‌పై మీ టూ ఉద్య‌మం ఉధృతంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.