'ఆకాశవాణి'లో విలన్ ఎవరో తెలుసా....
Send us your feedback to audioarticles@vaarta.com
'బాహుబలి' తో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు కార్తికేయ షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై కార్తికేయ నిర్మాతగా రూపొందిస్తున్న తొలి చిత్రం 'ఆకాశవాణి'. రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు, సింగర్ కాలభైరవ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం అవుతుంది. లిమిటెడ్ బడ్జెట్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో విలన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట.
ఈ పాత్రకు ముందుగా సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ అనుకున్నారు కానీ... ఇప్పుడు మోహన్‌లాల్ అయితే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నారట. ఒకవేళ మోహన్‌లాల్ బోర్డ్లోకి వస్తే బడ్జెట్ పెరుగుతుంది. అయితే సినిమాను మలయాళంలో కూడా విడుదల చేసుకోవచ్చు. ఒకవేళ మోహన్‌లాల్ ఒప్పుకోకపోతే డా.రాజశేఖర్‌ను ఆ పాత్రకు అప్రోచ్ కావాలనేది యూనిట్ ఆలోచనగా కనపడుతుందని సినీ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments