ఆకాశ్ 'అరణ్యం'
Send us your feedback to audioarticles@vaarta.com
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ పూరిని హీరోగా పరిచయం చేసిన చిత్రం 'మెహబూబా'. ఈ సినిమా ఆకాశ్‌కి తగినంత మేర సక్సెస్ కాలేదు. ఆకాశ్ పూరితో రెండో సినిమాను కూడా పూరియే నిర్మిస్తూ, డైరెక్ట్ చేస్తాడని వార్తలు వినిపించాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఆకాశ్ పూరి..బయటి దర్శకుడితో సినిమా చేయబోతున్నాడట. ఆ దర్శకుడెవరో తెలియదు కానీ.. అశోక్ నాయక్ అనే వ్యక్తి ఈ సినిమాను నిర్మిస్తాడట. అటవీ నేపథ్యంలో సాగే రోడ్ జర్నీ మూవీ ఇది అని .. కాబట్టి ఈ చిత్రానికి 'అరణ్యం' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com