నాని చేతుల మీదుగా అశోక్ సెల్వన్ ‘ఆకాశం’ ట్రైలర్ రిలీజ్

  • IndiaGlitz, [Saturday,October 29 2022]

వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ ద్వి (తెలుగు, తమిళం) భాషా చిత్రం ‘ఆకాశం’. ఈ చిత్రం ‘నీదాం ఒరు వానమ్’గా తమిళంలోనూ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్‌పై ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌ ఈ చిత్రంలో రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన సినిమా పెద్ద సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌కి విషెష్ తెలియజేశారు.

రీసెంట్‌గా విడుదల చేసిన ‘ఆకాశం’ టీజర్‌కి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ సందర్భంగా ఇప్పుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

అశోక్ సెల్వన్ మూడు డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో కనిపించారు. అతని లైఫ్‌లో మూడు దశల్లోని జీవితాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక పాత్రలను తీర్చి దిద్దిన తీరు, వాటిని వారు క్యారీ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

ప్రేమ, మోసం సహా లైఫ్‌లోని ఇతర భావోద్వేగాలు హీరో అశోక్ సెల్వన్ రోలర్ కోస్టర్‌లా ఎలా ముందుకు తీసుకెళ్లాడనేది సినిా అని స్పష్టంగా తెలుస్తోంది. దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే నవంబర్ 4 వరకు ఆగాల్సిందే. ట్రైలర్‌లో విదు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందించిన విజువల్స్, గోపి సుందర్ సంగీత సారథ్యం వహించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో అందమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించినట్లు స్పష్టమవుతుంది.

More News

దర్శకుడు వేణు శ్రీరామ్ చేతుల మీదుగా "భీమదేవరపల్లి బ్రాంచి" ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్ లాంచ్

"భీమదేవరపల్లి బ్రాంచి " ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన ఫస్ట్ లుక్,

కెప్టెన్‌గా శ్రీహాన్.. మళ్లీ బావ కౌగిట్లోకి ఇనయా, ఆదిరెడ్డికి సర్‌ప్రైజ్

బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా టాస్క్‌లు మంచి మజాను ఇస్తుండగా..

Faria Abdullah: లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ అడ్వంచర్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్... ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్  ఫరియా అబ్దుల్లా

దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్.

Balakrishna: నందమూరి బాలకృష్ణ తొలి బ్రాండ్ కమర్షియల్ 'సాయి ప్రియా గ్రూప్ 116 పారామౌంట్'

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృ తన తొలి బ్రాండ్ కమర్షియల్‌ తో అడ్వర్టైజింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

Spark: ఐస్ ల్యాండ్ బ్యూటీఫుల్ లొకేషన్స్‌లో ‘స్పార్క్’ పాట చిత్రీకరణ పూర్తి..

విక్రాంత్ హీరోగా ప‌రిచ‌య‌మవుతున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఛార్మింగ్ బ్యూటీస్‌ మెహ్రీన్ ఫిర్జాదా,