ఆస్కార్‌కు నామినేట్ అయిన 'ఆకాశం నీ హద్దురా'!
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య, అపర్ణ బాలమురళి జంటగా నటించిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ ఆత్మకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రైమ్ వీడియోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. మోహన్ బాబు, పరేశ్ రావెల్, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ధర్శకురాలు సుధా కొంగర కథను ఎత్తుకొన్న తీరు.. దానిని ఓ నోట్లో కొనసాగించిన విధానం ఆమె ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. కెప్టెన్ గోపినాథ్ రాసిన సింప్లి ఫ్లై అనే పుస్తకాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
సూర్య సైతం మహా పాత్రలో జీవించేశారు. కథలో బలం ఉంటే సూర్య దానిని వేరే లెవల్‌కు తీసుకెళతారని ఈ సినిమాతో మరోమారు రుజువైంది. తాజాగా ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచినట్టు సమాచారం. ఉత్తమ నటుడు, ఉత్తమ నటితోపాటు పలు విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయినట్టు తెలుస్తోంది. నిజానికి థియేటర్లలో విడుదలైన సినిమాలనే ఆస్కార్ అవార్డుల కోసం పరిశీలిస్తారు. అయితే కరోనా సంక్షోభం కారణంగా ఈసారి ఓటీటీల్లో విడుదలైన సినిమాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రానికి అవకాశం లభించినట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com