ఆస్కార్ బ‌రిలో  ‘ఆకాశం నీ హ‌ద్దురా’

  • IndiaGlitz, [Saturday,February 27 2021]

ఆస్కార్ బ‌రిలో దిగే సినిమాల లిస్టుల‌ను ఆస్కార్ అవార్డుల అకాడ‌మీ ప్ర‌క‌టించింది. 93వ ఆస్కార్ అకాడ‌మీ రేసులో పాల్గొన‌బోయే 366 చిత్రాలను క‌మిటీ ప్ర‌క‌టించింది. అనౌన్స్ చేసిన లిస్టులో సూర్య హీరోగా సుధా కొంగ‌ర దర్శ‌క‌త్వం వ‌హించిన శూర‌రై పోట్రు సినిమా కూడా ఉంది. ఈ సినిమాను తెలుగు ఆకాశం నీ హ‌ద్దురా పేరుతో తెలుగులోనూ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. కోవిడ్ స‌మ‌యంలో ఓటీటీలో విడుద‌లైన ఈ సినిమాకు ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఎయిర్ డెక్క‌న్ అధినేత ఆర్.గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన చిత్ర‌మిది. అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోయిన్‌గా న‌టించింది. అకాడమీ ప్ర‌క‌టించిన లిస్టులో ఉత్త‌మ‌చిత్రం, ఉత్త‌మ హీరో, ఉత్తమ హీరోయిన్ కేట‌గిరీల్లో ఈ సినిమా పోటీ ప‌డ‌నుంది.

ఇక ఇండియా నుంచి ఆస్కార్ బ‌రిలో పోటీపడుతున్న చిత్రాల లిస్టులో క‌లిర అటిత అనే ఒరియా చిత్రం కూడా ఉంది. అలాగే రాజ్‌కుమార్ రావ్‌, ప్రియాంక చోప్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ది వైట్ టైగ‌ర్ మూవీ కూడా ఈ లిస్టులో ఉంది. చివ‌రి జాబితాను మార్చి 15న ఆస్కార్ అకాడ‌మీ ప్ర‌క‌టించ‌నుంది. మరి ఫైనల్ లిస్టులో ఆకాశం నీ హద్దురా సినిమా ఉంటుందా? ఉండదా? అనే విషయం తెలియాలంటే మార్చి 15 వరకు ఆగాల్సిందే.