Aadudam Andhra: యువతకు అండగా 'ఆడుదాం ఆంధ్ర'.. సీఎస్కే టీంలోకి విజయగనరం కుర్రాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
నాయకుడు అనేవాడు ఏ కార్యక్రమం అయినా నిర్వహిస్తే అది ప్రజల భవిష్యత్‌కు ఉపయోగపడేలా ఉండాలి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో తమ స్వార్థం కోసం ఆలోచించే నాయకులే ఎక్కువ. తమకు రాజకీయంగా లబ్ధి జరిగే కార్యక్రమాలే అమలు చేస్తారు. కానీ ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇందుకు అతీతం. తాను అమలు చేసే ప్రతి కార్యక్రమంలో ప్రజలకు మేలు జరిగేలా చూస్తారు. అందులో ఓ సామాజిక ప్రయోజనం ఉండేలా తపిస్తారు. ఆ పథకాల ఫలితాలు చూస్తే ఆయన అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అంతిమంగా సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించిదై ఉంటుంది.
పచ్చకామెర్లు ఉన్నవాడికి..
ఈ క్రమంలోనే గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంపై ప్రతిపక్ష తెలుగుదేశం ఆడిపోసుకుంది. పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనపడ్డట్లు.. అవినీతిలో కూరుకుపోయిన వారికి ప్రతి పనిలో అవినీతి కనపడుతుంది. కానీ జగన్ ఎంతో ముందుచూపుతో ఆలోచించి పెట్టిన ఈ కార్యక్రమం ఫలితాలు వెనువెంటనే వచ్చాయి.
ముందుకొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్..
విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన పవన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ యాజమాన్యం ఆ కుర్రాడిని తమ టీంలో చేర్చుకునేందుకు ముందుకు వచ్చింది. అతడిలోని క్రీడా స్ఫూర్తి, నైపుణ్యాలను గుర్తించింది. త్వరలో జరిగే ఐపీఎల్‌కు సంబంధించి సన్నాహాలు జరుగుతుండగా ఇప్పుడు పవన్‌ను సైతం తమ ప్రాంఛైజీలో చేర్చుకుంటామని పేర్కొంది. ఆ కుర్రాడిని చెన్నై తీసుకెళ్లి మంచి శిక్షకులతో ట్రైనింగ్ ఇప్పించి మున్ముందు తమ జట్టులోకి తీసుకుంటాం అని చెప్పింది. నిరుపేద అయినా పవన్‌కు ఇది ఒక గొప్ప అవకాశం అని.. మున్ముందు అతడు క్రికెట్ రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కుటుంబసభ్యులు, మిత్రులు ఆశిస్తున్నారు.
సీఎం జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు..
కేవలం 'ఆడుదాం ఆంధ్ర'లో పాల్గొని సత్తా చూపడంతోనే తనకు ఈ అవకాశం వచ్చిందని పవన్ సంతోషం వ్యక్తం చేశాడు. తనలాంటి గ్రామీణ క్రీడాకారులకు ఈ క్రీడా పోటీలు ఎంతో ఉత్సాహాన్ని.. ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని తెలిపాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చే ఇలాంటి మహోన్నత కార్యక్రమం చేపట్టిన ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. తెలుగుదేశం నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని సూచిస్తున్నారు. యువతను, క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటుచేస్తున్న ఇలాంటి బృహత్తర కార్యక్రమాలను ఆహ్వానించి ప్రభుత్వాన్ని అభినందించాలని క్రీడా ప్రేమికులు కోరుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments