వారెవా ఆది..!

  • IndiaGlitz, [Saturday,November 10 2018]

ఆది సాయికుమార్ లుక్‌కి ట్రెమండ‌స్ రెస్సాన్స్ వ‌స్తోంది. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న సినిమా ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌. ఇందులో ఆయ‌న ఎన్ ఎస్ జి క‌మాండోగా న‌టిస్తున్నారు. ఆపాద‌మ‌స్త‌కం ఆయ‌న లుక్ మారిన తీరు చూసి నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ట‌ఫ్ క‌మాండోగా ఆయ‌న పెట్టిన పోజు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాకు సాయి కిర‌ణ్ అడివి ద‌ర్శ‌కుడు.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఎగ్జ‌యిటింగ్ డ్రామాతో తెర‌కెక్కే సినిమాగా మేక‌ర్స్ చెబుతున్నారు. ప్ర‌ముఖ మాట‌ల ర‌చ‌యిత అబ్బూరి ర‌వి ఈ చిత్రంలో నెగ‌టివ్ పాత్ర పోషిస్తున్నారు. రియ‌ల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ సినిమా రూపొందుతోంది. కార్తిక్ రాజు, నిత్యా న‌రేష్‌, షాషా ఛెత్రి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.