తండ్రైన యువ హీరో
- IndiaGlitz, [Friday,December 18 2015]
తండ్రైన యువ హీరో..ఎవరో కాదు హీరో ఆది. సాయికుమార్ తనయుడు ఆది గత ఏడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాజమండ్రికి చెందిన అరుణతో ఆది వివాహం గత సంవత్సరం డిసెంబర్ 13న అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు ఆది, అరుణ్ దంపతులకు పాప జన్మించింది. ఈ విషయాన్ని హీరో ఆది తన ఫేస్ బుక్ ద్వారా తెలియచేసాడు.
పాపకు మీ అందరి దీవెనలు కావాలని పేర్కొన్నాడు. పలువురు మిత్రులు, సినీ ప్రముఖులు పాపను ఆశీర్వదిస్తూ...శుభాకాంక్షలు తెలియచేసారు. ప్రేమ కావాలి సినిమాతో తొలి చిత్రంలో విజయం సాధించి తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరుచుకున్న ఆది తాజాగా గరం చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలో గరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.