కన్నడ హీరోయిన్ తో ఆది...
Send us your feedback to audioarticles@vaarta.com
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది హీరోగా ప్రయత్నాలు చేస్తూనే మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో `శమంతకమణి` అనే మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. దీనితో పాటు విశ్వనాథ్ అరిగెళ్ళ దర్శకత్వంలో సినిమాలో నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. జూన్ రెండో వారంలో ఈ సినిమా అధికారకంగా ప్రారంభం కానుంది.
ఈ చిత్రంలో ఆదికి జోడిగా కన్నడ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ నటించనుంది. జూన్ మూడో వారంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని విజయలక్ష్మి, చరణ్‌తేజ్ ఉప్పలపాటి నిర్మించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments