డిఫరెంట్ కోణంలో ఆది సాయికుమార్ 'బ్లాక్'
Send us your feedback to audioarticles@vaarta.com
మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే మాస్‌కమర్షియల్ హీరో ఆది సాయికుమార్ హీరోగా, ఆటగాడు చిత్రం తో పరిచయమైన దర్శనాబానిక్ ని హీరోయిన్ గా, జి.బి.కృష్ణ దర్శకత్వం లో మహంకాళి దివాకర్ నిర్మాతగా మహంకాళి మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రానికి బ్లాక్ అనే టైటిల్ ని యూనిట్ కనఫర్మ్ చేసారు. లాక్‌డౌన్ కి ముందు షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈచిత్ర షూటింగ్ 70% పూర్తిచేసుకుంది. మిగతా బ్యాలన్స్ షూటింగ్ ని లాక్‌డౌన్ తరువాత పూర్తిచేసి విడుదలకి చేయటానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. ఈరోజు ఈచిత్రం యెక్క టైటిల్ ని కొన్ని వర్కింగ్ స్టిల్స్ మరియు మేకింగ్ ని విడుదల చేయటం జరిగింది.
ఈ సందర్బంగా నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ.. మహంకాళి మూవీస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రానికి బ్లాక్ అనే టైటిల్ని ఖరారు చేసాము. టైటిల్ తో పాటు ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోని మరియు వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశాము. ఈ చిత్రానికి ఇప్పటికే భారి అంచనాలు వుండటంతో ఈ మేకింగ్ మరింత క్రేజ్ ని తీసుకువచ్చింది. ఎంతో కసిగా సక్సెస్ కోసం చూస్తున్న హీరో ఆదికి గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ డిఫరెంట్ కోణంలో కొత్తగా ఉంటుంది, ఈ చిత్రం ఆది కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుంది. భారీ సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రం లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ వర్క్ శరవేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాము. ఆది సాయికుమార్ అభిమానుల, సిని ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందని అని నిర్మాత అన్నారు.
నటీనటులు.. హీరోయిన్ - దర్శనా బానిక్, బిగ్ బాస్ కౌశల్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com