పవన్ కళ్యాణ్ తో ఆది పినిశెట్టి...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3న లాంచనంగా సినిమా ప్రారంభం అవుతుంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత ఈ హిట్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవుడే దిగి వచ్చినా అనే పేరు పరిశీలన ఉన్నట్లు సమాచారం.
ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో యంగ్ హీరో ఆది పినిశెట్టి నటించబోతున్నాడట. తెలుగు, తమిళంలో మంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఆది పినిశెట్టి తెలుగులో సరైనోడు చిత్రంలో విలన్‌గా నటించాడు. ఇప్పుడు నాని నిన్నుకోరి చిత్రంలో కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. రామ్‌చరణ్, సుకుమార్ చిత్రంలో కూడా ఓ కీ రోల్ చేస్తున్నాడు. తాజాగా పవన్ చిత్రంలో నటించడానికి ఆది పినిశెట్టి సిద్ధమయ్యాడని వినికిడి. ఈ సినిమాకు సంబంధించిన అధికారక సమాచారం త్వరలోనే విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments