హీరో ఆది సాయికుమార్ కొత్త చిత్రం ప్రారంభం!!!
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో ఆది సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హిట్ కొట్టాలని కసిమీద ఉన్న ఆదికి సరైన కథ దొరికిందని వెల్లడించారు. పూరి జగన్నాధ్ దగ్గర పని చేసిన జి.బి.కృష్ణ ఈ సినిమాకు కథ ఇవ్వడం జరిగింది. ఈ యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఆది సాయి కుమార్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది. ఆది సాయికుమార్ చేసిన గత సినిమాల కంటే ఈ సినిమాలో భిన్నంగా ఉంటుందని తెలిపారు. వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన ఈ చిత్రం షూటింగ్ జనవరిలో స్టార్ట్ చేసి సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కథ నచ్చడంతో ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీగా సినిమము నిర్మించబోతున్నట్లు నిర్మాత మహంకాళి దివాకర్ తెలిపారు. ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు చిత్ర యూనిట్ త్వరలో తెలియజేయనుంది. ఈ చిత్రానికి నిర్మాత: మహంకాళి దివాకర్, నిర్మాణ నిర్వాహణ : శంకర్, రచనా దర్శకత్వం: జీ.బి.కృష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com