యంగ్ హీరో మూవీలో బన్ని విలన్..

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

ద‌ర్శ‌కుడు ర‌విరాజా పినిశెట్టి త‌న‌యుడు హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగు, త‌మిళంలో హీరోగా న‌టిస్తూ వ‌చ్చిన ఆది పినిశెట్టిని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను స‌రైనోడు చిత్రంతో విల‌న్‌గా ప్ర‌జెంట్ చేశాడు. స‌రైనోడు ఆది విల‌నిజానికి మంచి పేరే వ‌చ్చింది. బోయ‌పాటి త‌న నెక్ట్స్ మూవీని బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో రూపొందిస్తున్నాడు.

ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే విక్ట‌రీ వెంక‌టేష్ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇస్తున్నాడ‌ని స‌మాచారం. అయితే మ‌రో కీల‌క‌పాత్ర‌లో న‌టించడానికి బోయ‌పాటి ఆదిపినిశెట్టిని ఒప్పించాడ‌ట‌. ఆది కూడా ఈ యంగ్ హీరో మూవీలో చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని అంటున్నారు. మ‌రి బోయపాటి ఆది పినిశెట్టిని ఈసారెలా చూపిస్తాడో మ‌రి.