ఆది, అడివి సాయికిరణ్ సినిమా అప్‌డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
'ప్రేమకావాలి', 'లవ్లీ' సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు ఆది. గత కొంత కాలంగా విజయాలకు దూరమైన ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం 'వినాయకుడు', 'విలేజీలో వినాయకుడు', 'కేరింత' సినిమాలను రూపొందించిన అడివి సాయికిరణ్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంతో ఎయిర్‌టెల్ 4జి భామ సాషా చెట్రి కథానాయికగా పరిచయం కానుంది. మనోజ్ నందం, పార్వతీశం ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. నిత్య నరేష్ కీలక పాత్రలో కనిపించనుంది.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. విశాఖపట్నం జిల్లా చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడ పోలీసులకు, టెర్రరిస్టులకు మధ్య సాగే కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కొత్త దర్శకుడు విశ్వనాథ్ ఆరిగేల తెరకెక్కించిన ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కూడా ఆది నటించారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.
వేసవి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రాలతో మళ్ళీ విజయాల బాట పట్టాలని ఆది భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com