సమంత-ఆది 'యు టర్న్' సెకండ్ షెడ్యూల్ మొదలు

  • IndiaGlitz, [Thursday,April 12 2018]

'రంగస్థలం'లో రామలక్ష్మిగా సమంత, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి విశేషమైన రీతిలో అశేష ప్రేక్షకలోకాన్ని మైమరపించిన తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం 'యు టర్స్'. కన్నడలో ఘన విజయం సొంతం చేసుకొన్న 'యు టర్న్' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ మొదలైంది.

తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తుండగా.. కన్నడ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్ చిత్తూరి మాట్లాడుతూ.. ఒక ఫ్లై ఓవర్ మీద చనిపోతున్న మోటార్ సైకిల్ రైడర్ల కేస్ ను ఛేదించే ఓ జర్నలిస్ట్ కథే 'యు టర్న్'. సమంత ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా నటిస్తోంది. ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

భాషా బేధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించదగ్గ కథ 'యు టర్న్'. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ షూటింగ్ గత నెల మొదలైంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ ముగిసింది. ఇప్పుడు సెకండ్ హైద్రాబాద్ లోని బూత్ బంగ్లాలో వేసిన భారీ సెట్ లో మొదలైంది.

ఈ షెడ్యూల్ లో సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. కన్నడ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. నరేన్, భూమికల పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి.

ఒరిజినల్ వెర్షన్ కంటే అద్భుతంగా తెలుగు-తమిళ రీమేక్ ను తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా తెలుగు-తమిళ నేటివిటీకి తగ్గట్లుగా చేసిన మార్పులు సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కుతున్న 'యు టర్న్' ప్రేక్షకులను విశేషమైన రీతిలో అలరించడం ఖాయం అన్నారు. 

More News

1700కి పైగా స్క్రీన్స్‌లో 'మెహబూబా' ట్రైలర్‌

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌

అనుప‌మ.. త‌న పేరుతోనే

'అఆ' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

సుకుమార్‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి

'రంగ‌స్థ‌లం'తో కెరీర్ బెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌.

మా అసోసియేషన్ వారి వలన శ్రీరెడ్డి సమస్యకు పరిష్కారం దొరకదు : కేతిరెడ్డి

మహిళల పై సినీరంగంలో, కాల్ సెంటర్లో ప్రభుత్వ కార్యాలయాలలో,లైంగిక వేధింపులు ఈ దేశంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని,తమకు జరిగిన అన్నాయం ను ముందుకు వచ్చి చైపే మహిళల్ని

'మెర్కురి' గొప్ప సినిమా గా నిలుస్తుంది.. - సందీప్ రెడ్డి వంగ

ప్రభుదేవా ప్రధాన పాత్రలో పెన్‌ స్టూడియోస్‌, స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌ సమర్పణలో.. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో కార్తీకేయన్‌ సంతానం, జయంతి లాల్‌ నిర్మించిన సైలెంట్‌ చిత్రం 'మెర్కురి'.