నేను ఇమేజ్ గురించి ఆలోచించడం లేదు - ఆది పినిశెట్టి

  • IndiaGlitz, [Monday,June 19 2017]

నేను హీరోగా భావించ‌డం లేదు, న‌టుడిగా నా ప్ర‌యాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. డిఫ‌రెంట్ జోన‌ర్స్ మూవీ చేసిన‌ప్పుడే అందులో కిక్ ఉంటుందని అంటున్నాడు ఆదిపినిశెట్టి. రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై A.R.K శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపినిశెట్టి, నిక్కిగ‌ల్రాని, రాందాస్ త‌దిత‌రులు న‌టించిన చిత్రం 'మ‌ర‌క‌త‌మ‌ణి'. సినిమా జూన్ 16న విడుద‌లైంది. ఈ సంద‌ర్బంగా ఆది మీడియాతో సినిమా గురించిన విశేషాల‌ను తెలియజేశాడు.

'మ‌ర‌క‌త‌మ‌ణి' త‌మిళంలో సూప‌ర్‌హిట్ టాక్‌తో ర‌న్ అవుతుంది. తెలుగులో కూడా మంచి హిట్ టాక్‌తో ర‌న్ అవుతుంది. సినిమా చూసిన 70 శాతం మంది సినిమా చాలా బావుంద‌ని అంటున్నారు. ఈ క‌థ విన్న‌ప్పుడు, కొత్త‌గా ఉంది అనిపించిందే త‌ప్ప‌, హీరోగా నాకిది ఏ మాత్రం హెల్ప్ అవుతుంద‌నిపించ‌లేదు. ప్రేక్ష‌కుడిగా క‌థ విని సెల‌క్ట్ చేసుకున్నాను. ద‌ర్శ‌కుడు శ‌ర‌వ‌ణ‌న్ సినిమాలోని ప్ర‌తి పాత్ర‌కు ప్రాముఖ్య‌తినిస్తూ సినిమాను బ్యాలెన్స్‌డ్‌గా తీసుకెళ్ళారు.

న‌టుడిగా ఇప్పుడు కోట్ల రూపాయ‌ల జాబ్ శాటిస్పాక్ష‌న్ ఉంది. ఎందుకంటే నేను ఇమేజ్‌ను ఆశించ‌డం లేదు. నాకు ఇమేజ్ కూడా లేద‌నే అనుకుంటాను. కానీ నా ఎత్తు, ప‌ర్స‌నాలిటీ చూసి కాస్తా యాక్ష‌న్ సీక్వెన్స్‌ను ఆడియెన్స్ ఊహిస్తారు. నేను యాక్షన్ చేయాల‌నుకుంటే మ‌రో ఐదేళ్ళ త‌ర్వాత ఇప్పుడు చేస్తున్న సినిమాల‌ను చేయ‌లేను. మృగం త‌ర్వాత వైశాలి చేశాను. ఈరోజు చూస్తే మ‌ర‌క‌త‌మ‌ణి సినిమాలో విల‌క్ష‌ణ‌మైన సినిమా చేశాను. అలా చేయ‌డం అనేది ఓ న‌టుడిగా నాకు తృప్తినిస్తుంది.

'రంగ‌స్థ‌లం 1985' మూవీలో నేను చేసే పాత్ర పాజిటివ్‌గా ఉంటుందా లేదా నెగ‌టివ్‌గా ఉంటుందా అని ఇప్పుడే ఏమీ చెప్ప‌లేను. అయితే సినిమా హార్ట్ ట‌చింగ్‌గా ఉంది. 1985 సెట్టింగ్స్ అన్ని కొత్త‌గా ఉన్నాయి. లోకేష‌న్‌కు వెళుతుంటే మా తాత‌య్య చూడ‌టానికి మా ఊరు వెళుతున్నాన‌నే భావ‌న క‌లుగుతుంది. అలాగే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ సినిమాలో కూడా మంచి పాత్ర చేస్తున్నాను. వాటి వివ‌రాలు ఇప్పుడు చెప్ప‌కూడ‌దు. నిన్ను కోరి చిత్రంలో వ‌రుణ్ అనే యువ‌కుడి పాత్రలో క‌న‌ప‌డ‌తాను. మూడు క్యారెక్ట‌ర్స్ ఉమ‌, ప‌ల్ల‌వి, అరుణ్ మ‌ధ్య ఏం జ‌రిగింద‌నేదే క‌థ‌. ఆ పాత్ర‌ల జ‌ర్నీయే సినిమా. సినిమాటిక్‌గా ఏమీ ఉండ‌దు. మ‌న లైఫ్‌లో జ‌రిగే విష‌యాల‌కు క‌నెక్ట్ అవుతుంటాం. ఆ క‌నెక్టింగ్ పాయింట్ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది.

More News

కథానాయికగా నేను నటిస్తున్న 50వ చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' - కాజల్ అగర్వాల్

అందం-అభినయం సమపాళ్లలో కలిగిన కథానాయకి కాజల్ అగర్వాల్.

నానికి రాజమౌళి ప్రశంస...

బాహుబలి సక్సెస్ తో నేషనల్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు ఎస్.ఎస్.రాజమౌళి.

సంఘమిత్రగా నయన...

బాహుబలి తర్వాత అంతే రేంజ్ లో సినిమా స్టార్ట్ చేయాలని దర్శకుడు సుందర్.సి ప్లాన్ వేశాడు.

మా అబ్బాయే నా ఎనర్జీ అంటున్న హీరో...

డైరెక్టర్ కావాలనుకుని హీరోగా మారి వరుస విజయాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని

ఎఫ్.ఎన్.సీసీ ఆధ్వర్యంలో కళాతపస్వి కె. విశ్వనాథ్ , ఎస్.బాలసుబ్రహ్మణ్యంకు ఘనంగా సన్మానం!!

కళాతపస్వి కె.విశ్వానథ్ ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.