ఇండస్ట్రీలో ఉన్న మనకు పట్టింపులు ఉన్నాయి కానీ..వాళ్లకు పట్టింపులు లేవు - ఆది పినిశెట్టి

  • IndiaGlitz, [Friday,April 22 2016]

ఒక విచిత్రం, వైశాలి, గుండెల్లో గోదారి, మ‌లుపు...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ క‌థానాయ‌కుడు ఆది పినిశెట్టి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు, త‌మిళ్ లో హీరోగా న‌టించిన ఆది తొలిసారి విల‌న్ గా న‌టించ‌డం విశేషం. అల్లు అర్జున్ - బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన స‌రైనోడు సినిమాలో ఆది విల‌న్ గా న‌టించారు. ఈ చిత్రం ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో ట‌ర్న‌డ్ విల‌న్ ఆది పినిశెట్టి తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...
మీరు ఫ‌స్ట్ టైమ్ విల‌న్ గా న‌టించారు క‌దా...! బ‌న్ని సినిమా కాబ‌ట్టి విల‌న్ గా న‌టించారా..? లేక క్యారెక్ట‌ర్ న‌చ్చి విల‌న్ గా చేసారా..?
ఈ క‌థ వినే ముందు విల‌న్ గా అయితే చేయ‌కూడ‌దు అనుకుంటునే క‌థ విన్నాను. క‌థ విన్న‌త‌ర్వాత ఇది రెగ్యుల‌ర్ గా ఉండే విల‌న్ క్యారెక్ట‌ర్ కాదు అని తెలిసింది. ఒక‌వేళ రొటీన్ గా ఉండుంటే నేను చేసుండేవాడిని కాదు. ఇది చాలా డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్. తెలుగులో రెగ్యుల‌ర్ గా ఉండే విల‌న్ క్యారెక్ట‌ర్ లా ఉండ‌దు. ఈ క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌గా ఉంటుంది. అలాగే బోయ‌పాటి గారు విల‌న్ క్యారెక్ట‌ర్ ని చాలా ప‌వ‌ర్ ఫుల్ గా చూపిస్తుంటారు. ఇక నేను విల‌న్ గా ఎందుకు చేసానంటే... బ‌న్ని సినిమా అంటే అంచ‌నాలు ఉంటాయి. అలాగే ఒక న‌టుడుగా తెలుగు సినిమాల్లో నాకు హెల్ప్ అవుతుంది. అందుచేత బ‌న్ని సినిమా కావ‌డం...అలాగే క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డం వ‌ల‌న విల‌న్ క్యారెక్ట‌ర్ చేయ‌డం జ‌రిగింది.
ఒక విచిత్రం, వైశాలి, గుండెల్లో గోదారి చిత్రాలు చేసినా మ‌లుపు సినిమాతో స‌క్సెస్ వ‌చ్చింది. అయితే స‌క్సెస్ వ‌చ్చిన వెంట‌నే విల‌న్ క్యారెక్ట‌ర్ చేయ‌డం ఎలా ఫీల‌వుతున్నారు..?
మ‌న ఆడియోన్స్ లో చాలా మార్పు వ‌చ్చింది. ఇంత‌కు ముందులా కాదు. హీరోగా చేస్తే..విల‌న్ గా చేయ‌కూడ‌దు. విల‌న్ గా చేస్తే హీరోగా చేయ‌కూడ‌దు అనే ప‌ట్టింపులు ఆడియోన్స్ కు లేవు. ఇండ‌స్ట్రీలో ఉన్న‌మ‌న‌కి కొన్ని ప‌ట్టింపులు ఉన్నాయి. హీరోగా న‌టిస్తే మంచి హీరోగా ఆడియోన్స్ ని క‌న్విన్స్ చేయాలి..అలాగే విల‌న్ గా న‌టిస్తే విల‌న్ గా క‌న్విన్స్ చేయాలి. ఒక న‌టుడుగా ఆడియోన్స్ ను ఏ పాత్ర చేసినా క‌న్విన్స్ చేయ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం ఉంది. మ‌లుపు సినిమాతో హీరోగా క‌న్విన్వ్ చేసాను. స‌రైనోడు సినిమాతో విల‌న్ గా క‌న్విన్స్ చేస్తాను.
ఈ క్యారెక్ట‌ర్ లో మీకు న‌చ్చింది ఏమిటి.?
ఈ క్యారెక్ట‌ర్ కి కొన్ని ప‌ద్ద‌తులు ఉన్నాయి. విల‌న్ అన‌గానే చెడ్డోడు.. వాడు ఏదైనా చేస్తాడు...ఎంత నీచానికైనా దిగ‌జార‌తాడు అని చూపిస్తుంటాం కదా..కానీ బోయ‌పాటి గారు ఈ సినిమాలో అలా చేయ‌లేదు. విల‌న్ కి ఒక్క చెడ్డ అల‌వాటు ఉండ‌దు. అర‌వ‌డాలు..అంద‌ర్నీ చంపేయ‌డాలు ఉండ‌వు. చాలా క్లాస్ గా సెటిల్డ్ గా బిహేవ్ చేస్తుంటాడు. సిగ‌రెట్, మందు త్రాగ‌డు..త‌న‌కంటూ కొన్ని ప‌ద్ద‌తులు ఉన్నాయి. వాటిని ఫాలో అవుతాడు. త‌న‌కి ఎదురు అంటూ ఏదీ లేదు. హీరోకి విల‌న్ కి ఢీ అంటే ఢీ అనే టైపులో ఉంటుంది. అలాగే వీరిద్ద‌రి మ‌ధ్య చిన్న ఫ‌న్ ఉంటుంది. అయితే విల‌న్ క్యారెక్ట‌ర్ చాలా ప‌వ‌ర్ ఫుల్. హీరో.. ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ ని ఎలా కొడ‌తాడ‌నేది చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. ఈ విధంగా నా క్యారెక్ట‌ర్ ఉంటుంది.
హీరో కంటే విల‌న్ ఒక స్ట‌ప్ ఎక్కువుగా ఉండాలి అందుకే మిమ్మ‌ల్ని తీసుకున్నాం అన్నారు క‌దా..! ఫిజిక‌ల్ గానా..? మైండ్ గేమ్ ప‌రంగానా..?
మైండ్ గేమ్ అయినా కావ‌చ్చు..ఫిజిక‌ల్ గా అయినా కావ‌చ్చు. అన్నిర‌కాలుగా ప‌వ‌ర్ ఫుల్ అయిన వ్య‌క్తిని సాధార‌ణ వ్య‌క్తి ఎలా ఢీ కొన్నాడు అనేదే ఈ కాన్సెప్ట్.
మీకు బ‌న్నికి మ‌ధ్య ఎన్ని సీన్స్ ఉన్నాయి..?
ప్ర‌తి సినిమాలో హీరో - విల‌న్ డైరెక్ట్ గా ఢీ కొన‌డం ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలా ఉండ‌దు. ఇంత కంటే ఎక్కువ చెప్ప‌లేను. సినిమా చూస్తే మీకే అర్ధం అవుతుంది.
సైలెంట్ అండ్ డిసెంట్ గా ఉండే మంచి విల‌న్ అంటున్నారు. బోయ‌పాటి సినిమా అంటే హేవీ డైలాగ్స్ ఉంటాయి. మ‌రి ఇందులో పంచ్ డైలాగ్స్ లాంటివి ఉంటాయా..?
పంచ్ డైలాగ్స్ ఏమీ ఉండ‌వు. కాక‌పోతే డైలాగ్స్ లో పంచ్ ఉంటుంది. బోయ‌పాటి గారి ప్ర‌త్యేక‌తే అది. అలాంటి డైలాగ్స్ ఈ సినిమాలో నాకు కూడా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ లో వ‌చ్చే సీన్స్ లో అలాంటి డైలాగ్స్ ఉన్నాయి. అవి ఏమిట‌నేది ఇప్పుడు నేను చెప్ప‌డం క‌న్నా థియేట‌ర్ లో చూస్తే బాగుంటుంది.
ఈ చిత్రాన్ని వేరే లాంగ్వేజ్ లో రీమేక్ చేస్తే ఆది క్యారెక్ట‌ర్ నేను చేస్తాను అని బ‌న్ని అన్నారు. మీ క్యారెక్ట‌ర్ గురించి అంత‌లా చెబుతుంటే అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. అంత‌లా మీ క్యారెక్ట‌ర్ లో ఏమి ఉంది..?
నేను చేసిన క్యారెక్ట‌ర్ గురించి నేను ఎక్కువ చెప్ప‌లేను. సినిమా చూసిన ఆడియోన్స్ చెప్పాలి. సాధార‌ణంగా విల‌న్ అంటే ఎగ్రెసివ్ గా చూసుంటారు. కానీ ఇందులో అలా ఉండ‌దు. చాలా స్టైలీష్ గా ఉంటాడు. అయితే ఆడియోన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటార‌నే భ‌యం ఉంది. ఆది విల‌న్ గా చేస్తున్నాడు అన‌గానే సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో చాలా ప‌ర్ ఫార్మెన్స్ రోల్ అయ్యింటుంది అనుకున్నారు.ఇది సెటిల్డ్ గా చేయాల్సిన క్యారెక్ట‌ర్. బోయ‌పాటి గారు కూడా అలాగే ఎక్స్ పెక్ట్ చేసారు. ఎక్క‌డ రియాక్ట్ అవ్వాలో అక్క‌డ మాత్ర‌మే రియాక్ట్ అవుతాడు. కొత్త‌గా క్రియేట్ చేసిన క్యారెక్ట‌ర్ ఇది. ఆడియోన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఈ క్యారెక్ట‌ర్ కోసం ఏదైనా రిఫ‌రెన్స్ తీసుకున్నారా..?
బోయ‌పాటి గార్కి విల‌న్ క్యారెక్ట‌ర్ ఎలా ఉండాల‌నేది చాలా క్లియ‌ర్ ఐడియా ఉంది. అందుచేత రిఫ‌రెన్స్ ఏమీ తీసుకోలేదు. ఆయ‌న చెప్పిన‌ట్టు చేసాను అంతే.
బోయ‌పాటి గారు స్టోరీ నెరేష‌న్ అంటే ఇన్ వాల్వ్ అయి ఏక్ట్ చేసి మ‌రీ చూపిస్తార‌ని...కొంత మంది భ‌య‌ప‌డుతుంటారు. ఆయ‌న క‌థ చెప్ప‌డం మీకు ఏమినిపించింది..?
ఆయ‌న స్టోరీ నెరేష‌న్ త్రిడి లా.. డి.టి.ఎస్ ఎఫెక్ట్స్ లా.. చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది. ఒక నెరేష‌న్ ఎలా ఉండాలంటే..సినిమాలో ఏం చూపించాల‌నుకుంటారో అది చెప్పాలి. అలాగే బోయ‌పాటి గారు చెప్పారు. ఆయ‌న సినిమాలో ప‌వ‌ర్ అనేది ప్ర‌తి షాట్ లో క‌నిపిస్తుంటుంది. అలాగే నెరేష‌న్ లో కూడా ప‌వ‌ర్ ఉంది. వినేట‌ప్పుడు చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫిల్మ్ లైఫ్ లో ఫ‌స్ట్ టైమ్ చేసాను. ఇది ఒక డిఫ‌రెంట్ ఎక్స్ పీరియ‌న్స్.
బోయ‌పాటి సినిమా అంటేనే వ‌యోలెన్స్ ఎక్కువుగా ఉంటుంది. మ‌రి ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుందా..?
బ‌న్నికి చిన్న పిల్ల‌ల ఆడియోన్స్ ఎక్కువుగా ఉన్నారు. అందుచేత దీనిని దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా చేయ‌డం జ‌రిగింది. ఓన్లీ మాస్ - ఓన్లీ యాక్ష‌న్ చూసేవారి కోస‌మ‌ని ఈ సినిమా చేయ‌లేదు. కామెడీ, డ్యాన్స్, ఫైట్స్ ఫ్యామిలీ ఎమోష‌న్స్..ఇలా అన్ని ఉన్నాయి. అందుచేత అన్ని వ‌య‌సు వాళ్లు థియేట‌ర్ లో కూర్చొని ఎంజాయ్ చేసేలా తీసిన‌ సినిమా ఇది,
మీరు - బ‌న్ని ఎప్ప‌టి నుంచి ఫ్రెండ్స్..?
చిన్న‌ప్ప‌టి నుంచి మీమిద్ద‌రం ఫ్రెండ్స్.ఒకే స్కూల్ లో చ‌ద‌వ‌లేదు కానీ కుంగ్ ఫూ క్లాస్ కి క‌ల‌సి వెళ్లేవాళ్లం. ప్ర‌తి ఆదివారం బీచ్ కి వెళ్లి ప్రాక్టీస్ చేసేవాళ్లం. తెలుగు ఇండ‌స్ట్రీ చెన్నైలో ఉండేది ఆత‌ర్వాత హైద‌రాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. ఆత‌ర్వాత నేను ఇంజ‌నీరింగ్ చ‌దువులో బిజీ అయిపోయాను. షూటింగ్ కి వ‌చ్చే ముందు బ‌న్ని పెద్ద హీరో ఎలా ఉంటాడు అని చిన్న డౌట్ ఉండేది. షూటింగ్ కి వ‌చ్చిన త‌ర్వాత తెలిసింది ఏమిటంటే..బ‌న్నిలో ఏమాత్రం మార్పులేదు. అప్ప‌డు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలానే ఉన్నాడు.
అప్పుడు మీరిద్ద‌రు ఎలా ఉండేవారు..? మ‌ర‌చిపోలేని సంఘ‌ట‌న గురించి..?
బాగా కొట్టుకునే వాళ్లం. కుంగ్ ఫూ క్లాస్ అంటే కొట్టుకోవ‌డ‌మే క‌దండీ..మ‌ర‌చిపోలేని సంఘ‌ట‌న గుర్తు లేదు కానీ...బీచ్ కి వెళ్లి ఇద్ద‌రం బాగా ర‌న్నింగ్ చేసేవాళ్లం. నేను, బ‌న్ని, మంచు మ‌నోజ్, విష్ణు క‌ల‌సి కుంగ్ ఫూ క్లాస్ కి వెళ్లేవాళ్ళం.
బోయ‌పాటి గారితో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంది..?
ఆయ‌న‌కు ఆడియోన్స్ నాడి బాగా తెలుసు. ఆడియోన్స్ కు ఏది కావాలో అది స్ర్కీన్ పై తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. ఆడియోన్స్ ను బాగా అబ్జ‌ర్వ్ చేసారు. రెండున్న‌ర గంట‌లు సినిమా అంటే ఫ‌స్ట్ 20 మినిట్స్ ఆడియోన్స్ మెంటాలిటీ ఏమిటి..? వాళ్లు ఏమి కోరుకుంటారు..? ఇంట‌ర్వెల్ ముందు ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారు..? ఇంట‌ర్వెల్ త‌ర్వాత ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారు..? ప్రీ క్లైమాక్స్ ఎలా ఉండాలి..? క్లైమాక్స్ లో సినిమా ఎలా ఎండ్ అవ్వాలి అనే విష‌యం పై ఫుల్ క్లారిటి ఉంది. ఆడియోన్స్ నాడి బాగా తెలిసిన బోయ‌పాటి గారితో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ మ‌ర‌చిపోలేని అనుభూతి.
ర‌కుల్ ప్రీత్ సింగ్ కాంబినేష‌న్ లో మీకు సీన్స్ ఉన్నాయా..?
ర‌కుల్ ప్రీత్ సింగ్ కాంబినేష‌న్లో సీన్స్ ఉన్నాయి. అయితే నేను విల‌న్ క‌దా...మా ఇద్ద‌రి మ‌ధ్య ఉండే సీన్స్ సీరియ‌స్ గా ఉంటాయి. మార్నింగ్ ఎగ్రెసివ్ మూడ్ లో వ‌చ్చేవాడిని అదే మూడ్ తో వెళ్లేవాడిని. ర‌కుల్ మంచి ఏక్ట్ర‌ర‌స్.
బ‌న్నికి మీకు యాక్ష‌న్ సీన్స్ ఉంటాయా..?
ఫ‌స్ట్ నుంచి లాస్ట్ వ‌ర‌కు మా ఇద్ద‌రి మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఈ వార్ డైరెక్ట్ గాను ఇన్ డైరెక్ట్ గాను ఉంటుంది. ఫిజిక‌ల్ ఫైట్ అంటే క్లైమాక్స్ లో అంత‌కంటే మందు వ‌చ్చే సీన్స్ లో ఉంటుంది.
స‌రైనోడు మీకు స్టార్ డ‌మ్ తీసుకువ‌స్తుందా..?
నాకు ఆడియోన్స్ మ‌న‌సులో చిన్న గుర్తింపు ఉంటే చాలు అనుకుంటున్నాను. ఏ క్యారెక్ట‌ర్ చేసినా ఆది బాగా చేస్తాడ‌నే గుర్తింపు ఉంటే చాలు. అది రావ‌డ‌మే చాలా క‌ష్టం. స్టార్ డ‌మ్ వ‌స్తే..ఎంజాయ్ చేస్తాను. న‌టుడుగా న‌న్ను నేను నిరూపించుకోవాల‌నుకుంటున్నాను. అది జ‌రిగితే నేను హ్యాఫీ.
తెలుగు - త‌మిళ్ క‌న్న‌డ‌లో సినిమాలు చేసారు క‌దా..ఏ ఇండ‌స్ట్రీ బాగుంది..?
నేను తెలుగు - త‌మిళ్ రెండు డిఫరెంట్ ఇండ‌స్ట్రీస్ అనుకోవ‌డం లేదు. అక్క‌డేమో రియ‌ల‌స్టిక్ మూవీస్ లైక్ చేస్తుంటారు. తెలుగులో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు లైక్ చేస్తుంటారు. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ‌, హిందీ సినిమాల భాష వేరైనా సినిమా ఒక్క‌టే అనుకుంటాను. కాక‌పోతే అక్క‌డ ఉండే ఆడియోన్స్ అభిరుచులు మారుతుంటాయి అంతే.
ఫ‌స్ట్ సినిమా స‌రైన‌ది చేయ‌క‌పోతే నెక్ట్స్ మూవీ స‌రైన‌ది రాదు. అందుచేత తేజ ఒక విచిత్రం స‌క్సెస్ కాక‌పోవ‌డం వ‌ల‌నే నెక్ట్స్ మంచి సినిమా రాలేద‌నుకుంటారా.?
100% అవ్వ‌చ్చు..ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అనేది చాలా ముఖ్యం. అయితే నా ఫ‌స్ట్ సినిమా బాగా ఆడ‌క‌పోవ‌డం వ‌ల‌నే త‌మిళ్ లో ఆఫ‌ర్ వ‌చ్చి ఉండ‌చ్చు. అయితే ఇప్ప‌టికి ఒక విచిత్రం గురించి చాలా మంది నాతో మాట్లాడుతుంటారు. స‌క్సెస్ ఫెయిల్యూర్ అనేది ప‌క్క‌న పెడితే నా ఫ‌స్ట్ సినిమా మంచి గుర్తింపు ఇచ్చింది. అందుచేత నా డైరెక్ట‌ర్ తేజ గార్కి, నిర్మాత దాస‌రి గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. అంద‌రూ సినిమా బాగా రావాల‌నే వ‌ర్క్ చేస్తారు. అయితే సినిమా ఆడుతుందా లేదా అనేది మ‌న చేతుల్లో ఉండ‌దు. ఒక న‌టుడుగా తేజ గారి ద‌గ్గ‌ర నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా క్ర‌మ‌శిక్ష‌ణ అనేది ఆయ‌న్ని చూసి నేర్చుకున్నాను. ఆయ‌న‌కి సినిమా పై ఉండే ఫేష‌న్ ఎగ్రిసివ్ వేలో తీసుకెళుతుంది. చెప్పేది కాస్త ఎగ్రిసివ్ గా చెబుతుంటారు. సినిమా మీద ప్రేమ లేక‌పోతే ఎగ్రిసివ్ గా ఉండ‌రు. ఒక విచిత్రం స‌రిగా ఆడ‌లేద‌ని తేజ గార్ని త‌ప్పుప‌ట్ట‌లేను. నా ఫ‌స్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ ఆయ‌న‌. అందుచేత‌ తేజ గారే నా గురువు అనుకుంటాను.
మ‌లుపు సినిమా త‌మిళ్ లో ఆడ‌లేదు. కానీ..తెలుగు వెర్షెన్ కి కాస్త మార్చి రిలీజ్ చేసారు స‌క్సెస్ అయ్యింది. అయితే త‌మిళ్ వెర్షెన్ కి కూడా అలా చేసి ఉంటే అక్క‌డ కూడా ఆడేది క‌దా..ఎందుకు చేయ‌లేదు..?
డైరెక్ట‌ర్ త‌మిళ్ లో రెండున్న‌ర గంట‌లు ఉండాల‌నుకున్నారు. మా అన్న‌య్యే అని కాదు డైరెక్ట‌ర్ అనుకున్న‌దే సినిమా. త‌మిళ్ లో అలా ఉండాలి అనుకున్నారు. తెలుగులో ఇలా ఉండాలి అనుకున్నారు అంతే. తెలుగు ఆడియోన్స్ మ‌లును సినిమాని ఆద‌రించినందుకు హ్యాఫీగా ఫీల‌వుతున్నాను.
మీ నాన్న‌గారు (రవిరాజా పినిశెట్టి) ఇన్ వాల్వ్ మెంట్ ఎంత వ‌ర‌కు ఉంటుంది..?
నాన్న గారి ఎక్స్ పీరియ‌న్స్ మాకు బాగా హెల్ప్ అవుతుంటుంది. ఆయ‌న మాకు మంచి స‌ల‌హాలు ఇస్తుంటారు. నాకు ఇలా చేస్తే బాగుంటుంద‌నిపిస్తుంది అని చెబుతుంటారు. నిర్ణ‌యం మాత్రం మ‌మ్మ‌ల్నే తీసుకోమంటారు. నాన్న‌గారు ఎంతో ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న డైరెక్ట‌ర్. ఆయ‌న ఇచ్చే స‌ల‌హాల‌ను ఇప్పుడున్న ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తే బాగుంటుంది అని నిర్ణ‌యం తీసుకుంటాం.
తెలుగులో స్ట్రైయిట్ ఫిల్మ్ ఎప్పుడు చేస్తున్నారు..?
తెలుగు - త‌మిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నాను. ఒక స్ట్రైయిట్ త‌మిళ్ ఫిల్మ్ చేస్తున్నాను.
తెలుగులో చేస్తున్న సినిమాల వివరాలు.?
వెరీ ఇంట్ర‌స్టింగ్ స్ర్కిప్ట్ ఇది. ట్ర‌జ‌ర్ హంట్ జోన‌ర్ లో చేస్తున్న సినిమా ఇది. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు తెలియ‌చేస్తాం.
మీ ఫ్రెండ్స్ ఎవ‌రైనా మీరు ఈ క్యారెక్ట‌ర్ కి సూట్ అవుతారు..ఇలాంటి క్యారెక్ట‌ర్స్ చేస్తే బాగుంటుంది అని చెబుతుంటారా..?
వైశాలి సినిమా త‌ర్వాత పోలీస్ క్యారెక్ట‌ర్ నీకు బాగుంది. అలాంటి క్యారెక్ట‌ర్స్ చేయ‌మ‌న్నారు. మురుగ‌న్ సినిమా త‌ర్వాత చాలా మంది ఆ టైప్ క్యారెక్ట‌ర్స్ తోనే సినిమా చేయ‌మ‌ని వ‌చ్చారు. మురుగ‌న్ త‌ర్వాత సంవ‌త్స‌రం పాటు ఖాళీగా ఇంట్లో కూర్చొనున్నాను. చేసిన క్యారెక్ట‌రే మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తే అలాంటి క్యారెక్ట‌ర్ కే సూట్ అవుతాన‌ని అనుకుంటారు. మృగం సినిమాకి వైశాలికి సంబంధ‌మే ఉండ‌దు. అప్ప‌టి వ‌ర‌కు మృగం లాంటి క్యారెక్ట‌ర్ కే సూట్ అవుతాను అనుకున్న ఆడియోన్స్ వైశాలి చూసిన త‌ర్వాత క‌న్విన్స్ అయ్యారు. సాఫ్ట్ అండ్ క్లీన్ రోల్స్ కి కూడా చేయ‌గ‌ల‌డు అనుకున్నారు. విమ‌ర్శ అనేది చాలా ముఖ్యం అని నేను న‌మ్ముతాను. ఒక మ‌నిషి వ‌చ్చి నువ్వు ఇది బాగా చేయ‌డం లేదు ఇంకా బెట‌ర్ గా చేస్తే బాగుంటుది అని చెప్పిన‌ప్పుడు అది స్వీక‌రిస్తాను. దానిలో బెట‌ర‌మెంట్ కోసం ప్ర‌య‌త్నిస్తాను.
హీరోగానే కాకుండా విల‌న్ గా కూడా చేయ‌డానికి రెడీనా..?
నా క్యారెక్ట‌ర్ కి ఇంపార్టెంట్స్ ఉండాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడ‌ను. ప్ర‌తి పెద్దోడు ఒక‌ప్పుడు చిన్నోడే. అలాగే టెక్నీక‌ల్ ట్రీమ్ స్ట్రాంగ్ గా ఉండాలి. మ‌ల్టీస్టార్ అయినా, విల‌న్ క్యారెక్ట‌ర్ అయినా చేస్తాను.
స‌రైనోడు ఆడియోన్స్ కి ఎలాంటి ఫీలింగ్ క‌లిగిస్తుంది..?
కంప్లీట్ ఫుల్ మీల్స్ చేసిన‌ప్పుడు ఎలాగైతే తృప్తిగా ఉంటుందో అలాంటి ఫీలింగ్ క‌లిగిస్తుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వ‌ర‌కు అంద‌రూ ఫ్యామిలీతో క‌ల‌సి చూసి ఎంజాయ్ చేసే సినిమా స‌రైనోడు.

More News

నాగార్జున - రాఘ‌వేంద్ర‌రావుల‌ హ‌థీరామ్ బాబా రికార్డింగ్ ప్రారంభం

కింగ్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన‌ అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి ఈ మూడు భ‌క్తిర‌స చిత్రాలు అధ్యాత్మిక అద్భుత చిత్రాలుగా నిలిచిన విష‌యం తెలిసిందే.

శాత‌క‌ర్ణి నేను ఒక్క‌టే - బాల‌య్య‌

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ వంద‌వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. అయితే.. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి నేను ఇద్ద‌రం ఒక్క‌టే అని చెప్పారు బాల‌య్య‌. ఇంత‌కీ బాల‌య్య అలా ఎందుకు చెప్పారు అనుకుంటున్నారా..?

చైతన్య - కళ్యాణ్ కృష్ణ సినిమా ప్రారంభం..

నాగ చైతన్య ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో,ప్రేమమ్..చిత్రాల్లో నటిస్తున్నాడు.

సంతోష్ శోభన్ హీరోగా సింప్లీ జిత్ ప్రొడక్షన్స్ చిత్రం

గోల్కొండ హైస్కూల్,తను నేను చిత్రాల హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా సింప్లీ జిత్ ప్రొడక్షన్స్ పతాకంపై

సి.ఎం కె.సి.ఆర్ సమక్షంలో ఘనంగా బాలకృష్ణ వందవ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రారంభం

నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అన్నపూర్ణ స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది.