అథ్లెట్‌గా ఆది.. 12 నుండి షూటింగ్‌

  • IndiaGlitz, [Sunday,June 02 2019]

వైవిధ్య‌మైన క‌థ‌లు, పాత్ర‌ల‌తో మెప్పిస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ న‌టుడు ఆది పినిశెట్టి. ఈయ‌న త‌ర్వ‌లోనే ఓ స్పోర్ట్స్ డ్రామాలో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జూన్ 12 నుండి ప్రారంభం అవుతుంది. ప్రిత్వి ఆదిత్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రూపొందించ‌నున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

ఓ యువ‌కుడు అథ్లెట్‌గా మారే క్ర‌మంలో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశాడు. వాటిని ఎలా అధిగ‌మించి ఉన్న‌త‌స్థాయికి చేరుకున్నాడ‌నేదే ప్ర‌ధాన క‌థాంశం. ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయ‌న్ నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ సంస్థ రూపొందిస్తోంది. పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌వీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

More News

సూర్య ఫస్ట్ హాఫ్ లో హీరో, సెకండ్ హాఫ్ లో విలన్ - 'ఎన్ జీ కే' డైరెక్టర్ శ్రీ రాఘవ

'గజిని' 'సింగం' వంటి విలక్షణ చిత్రాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న సూర్య హీరోగా '7G బృందావన కాలనీ', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాలతో

జులై 19 న డిస్నీ లయన్ కింగ్ విడుదల

క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి.

'సెవెన్'లో లిప్‌లాక్ లేని హీరోయిన్ నేనే అనుకుంట‌! - పూజితా పొన్నాడ

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'.

‘టిక్‌టాక్‌’లో వీడియోలు చేస్తోందని భార్యను చంపేశాడు!

రోజురోజుకు పెరుగున్న టెక్నాలజీతో ఎన్ని లాభాలున్నాయో.. అంతకు రెట్టింపు నష్టాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.

వైసీపీ తరఫున పోటీ చేయలేకపోయిన డైరెక్టర్!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ స్థానాలు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.