వెబ్ మీడియా ఇక ఇక్కడితో పెద్ద ఇష్యూ చేయకుండా ఆపేస్తారని ఆశిస్తున్నాను- త్రివిక్రమ్ శ్రీనివాస్

  • IndiaGlitz, [Sunday,June 05 2016]
యువ హీరో నితిన్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం అ ఆ. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలో నితిన్, స‌మంత జంట‌గా న‌టించారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవ‌ల రిలీజైన అ ఆ చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.
ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్లో ఏర్పాటు చేసిన అ ఆ స‌క్సెస్ మీట్ లో...
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ....ఈ సినిమా చేయాల‌నుకున్న‌ప్పుడు నాకు ఇష్ట‌మైన రైట‌ర్ యుద్ధ‌న‌పూడి సులోచ‌న దేవి గార్ని క‌లిసాను. కొన్ని పాత్ర‌లు గురించి మేమిద్ద‌రం డిష్క‌స్ చేసుకున్నాం. ఈ సినిమా టైటిల్స్ లో థ్యాంక్స్ కార్డ్ లో ఆమె పేరు వేయాల‌ని అప్పుడే అనుకున్నాం. కానీ..కొన్ని టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ వ‌ల‌న కుద‌ర‌లేదు. ఇప్పుడు మా టెక్నిషియ‌న్స్ శ్ర‌మించి ఆమె పేరు థ్యాంక్స్ కార్డ్ ఎండింగ్ లో యాడ్ చేసారు. ఇక ఇక్క‌డితో వెబ్ మీడియా వాళ్లు పెద్ద ఇష్యూ చేయ‌కుండా ఆపేస్తార‌ని అనుకుంటున్నాను.
స‌మంత ఒక రోజు మీరు బ్రెయిన్ తో కాకుండా మాతో మాట్లాడిన‌ట్టుగా హార్ట్ తో ఎందుకు డైలాగ్స్ రాయ‌రు అని అడిగింది. ఈ చిత్రంలో స‌మంత అడిగిన‌ట్టు హార్ట్ తో రాయ‌డానికి ప్ర‌య‌త్నించాను. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత ఏ సినిమా చేయాలి అని ఆలోచిస్తున్న టైమ్ లో నితిన్ తో సినిమా చేస్తాన‌ని చెప్పావు. ఇప్పుడు నితిన్ తో సినిమా చేయ‌డం ధ‌ర్మం అని గుర్తుచేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.ఇక సినిమా విష‌యానికి వ‌స్తే... సీనియ‌ర్ న‌రేష్‌, రావు ర‌మేష్ గారు పాత్ర‌కు త‌గ్గ‌ట్టు బాగా న‌టించారు. ముఖ్యంగా నితిన్, స‌మంత ఈ సినిమా కోసం పూర్తి స‌మ‌యం కేటాయించారు. ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అందుకే అ ఆ ఇంత పెద్ద విజ‌యం సాధించింది. మా చిత్రానికి పెద్ద విజ‌యాన్నిఅందించిన ఆడియోన్స్ అంద‌రికీ థ్యాంక్స్ అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ...ఈ సినిమా స‌క్సెస్ అవ్వ‌డం వెన‌క మూడు కార‌ణాలు ఉన్నాయి. ఆ మూడు కార‌ణాల్లో ఒక‌టి రెండు మూడు అన్నీ త్రివిక్ర‌మ్ గారే. సినిమా రేపు రిలీజ్ అన‌గా కూడా ఎంత‌గానో శ్ర‌మించారు. ఈ సినిమాకి సంబంధించి పూర్తి క్రెడిట్ త్రివిక్ర‌మ్ గారికి ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. ఆయ‌న క్లాస్ డైరెక్ట‌ర్.. మాస్ డైరెక్ట‌ర్...కాదు యూనివ‌ర్శ‌ల్ డైరెక్ట‌ర్. ఇక మా నిర్మాత రాధాకృష్ణ గారు గురించి చెప్పాలంటే...నా మార్కెట్ ఎంత అని ఆలోచించ‌కుండా న‌మ్మ‌కంతో ఎక్కువ బ‌డ్జెట్ పెట్టారు. నాకు హిట్ ఇవ్వ‌డ‌మే కాకుండా నా రేంజ్ కూడా పెంచిన నిర్మాత‌ రాథాకృష్ణ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.
హీరోయిన్ స‌మంత మాట్లాడుతూ...నాకు కొన్ని సినిమాలు క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు అందిస్తే...మ‌రికొన్ని సినిమాలు మంచి క‌లెక్ష‌న్స్ సాధించాయి. ఈ సినిమా ప్ర‌శంస‌ల‌తో పాటు క‌లెక్ష‌న్స్ కూడా రాబ‌డుతుండ‌డం ఆనందంగా ఉంది. అ ఆ విజ‌యాన్ని ప‌ర్స‌న‌ల్ విక్ట‌రీగా భావిస్తున్నాను. మ‌నీ కోసం కాకుండా స‌క్సెస్ కోసం ఈ సినిమాకి వ‌ర్క్ చేసాం. అనుకున్న విధంగా త్రివిక్ర‌మ్ గారు పెద్ద విజ‌యాన్ని సాధించారు అన్నారు.
సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ మాట్లాడుతూ...అ ఆ ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంద‌ని నేను ముందే చెప్పాను. నేను చెప్పిన‌ట్టుగానే మంచి సినిమా అవ్వ‌డం సంతోషంగా ఉంది. నా సెకండ్ ఇన్నింగ్స్ లో నాకు ఎంత‌గానో బూస్ట‌ప్ ఇచ్చిన సినిమా ఇది అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో అజ‌య్, ప్ర‌వీణ్, హ‌రి తేజ‌, కృష్ణ చైత‌న్య‌, శ్రీనివాస‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొని అ ఆ విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేసారు.