యూత్‌ఫుల్‌గా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్తదనంతో నిండిన సినిమాలు చేస్తూనే వుంటారు యువ హీరో సుధీర్ బాబు. గతేడాది ‘శ్రీదేవి సోడా సెంటర్’’ సినిమాతో ప్రేక్షకులను అలరించారాయన. తాజాగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు చేస్తోన్న సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇందులో ఆయన సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. శనివారం ఈసినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు.
ఇందులో సుధీర్ బాబు దర్శకుడి క్యారెక్టర్లో... డాక్టర్ అలేఖ్య పాత్రలో కృతి శెట్టి కనిపిస్తున్నారు. ‘‘తీశావ్ లేవోయ్ బోడి... అదే అనాథ హీరో, అదే బుర్ర బట్టలు లేని హీరోయిన్, అదే గొంతులో మాట్లాడే విలన్. అర్థం పర్థం లేని పాటలు' అంటూ తెలుగులో ఫక్తు కమర్షియల్ సినిమాలపై సెటైర్స్ వేయించారు దర్శకుడు .
'ఓ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ లాంటి అమ్మాయి చుట్టూ జరిగే కథ తీద్దామని అనుకుంటున్నాను' అని హీరో డైలాగ్ చెప్పిన తర్వాత హీరోయిన్ కృతి శెట్టిని పరిచయం చేశారు. ఆమెను తన సినిమాలో హీరోయిన్ గా ఒప్పించడానికి హీరో తాపత్రయ పడటం ఈ టీజర్ లో చూపించారు. ఆ అమ్మాయిని హీరో సినిమాల్లోకి ఎలా తీసుకొచ్చాడనేది అసలు కథగా తెలుస్తోంది. 'ఇన్ని రోజులు నన్ను నేను అమ్ముకుని సినిమాలు తీశాను. మొదటిసారి నన్ను నేను నమ్ముకుని సినిమా తీద్దామని అనుకుంటున్నాను' అని హీరోగా సుధీర్ బాబు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ - మైత్రీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com