'ఏ1 ఎక్స్‌ప్రెస్'ను నిజానికి 40 రోజుల్లో తీశాం: సందీప్ కిషన్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న 25వ చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. హాకీ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా ఈ చిత్రం గుర్తింపు పొందింది. ఈ చిత్రం మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హీరో రామ్ పోతినేని హాజరయ్యాడు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘మామూలుగా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ. కానీ కొన్ని చోట్ల మాత్రం మనకన్నా బెటర్‌గా ఎవరైనా ఒక పని చేసినప్పుడు ఒప్పుకోవాలి.
రామ్ పోతినేని డ్యాన్సులు చూసిన ప్రతి సారీ తనకు అయ్యో సబా అన్నట్టుంటుంది. నేను తనను చాలా ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటాను. ఈ సినిమాను మేము నిజానికి 40 రోజుల్లో తీశాం. నేను ఏ సినిమాలో కష్టాలు పడలేదు. బెస్ట్ సినిమా తీసేందుకు మాత్రమే పోరాడాం అన్నాం. అది ఈ సినిమా. దానికి కారణం మా పార్ట్‌నర్స్, ప్రొడ్యూసర్స్, నా కో స్టార్ లావణ్య. చాలా అందంగా ఉంటుంది. అందాల రాక్షసి. చాలా హిట్స్ ఇచ్చింది. నాకెప్పటి నుంచో ఫ్రెండ్. చాలా సార్లు థాంక్యూ చెప్పొచ్చు.. అది తనకూ తెలుసు. ఈ సినిమాలో నటించినందుకు థాంక్యూ లావణ్య. మోస్ట్ ఇంపార్టెంట్.. మా డైరెక్టర్ డెన్నీ.. వైజాగ్ నుంచి వచ్చి ఒక షార్ట్ ఫిలిం మేకర్ ఒక కథ చెప్పి.. తన హార్డ్ వర్క్‌ను చూపించుకుంటే.. మేము నమ్మి ఆయన చేతిలో ఒక సినిమాను పెట్టాము. తను మాకు ఈ సినిమాను ఇలా ఇచ్చాడు.
ఈ సినిమాలో అందరు నటులు.. అభిజిత్, మురళీశర్మగారు, రావు రమేష్ గారు, దర్శి, రాహుల్.. ఆ క్యారెక్టర్స్ గురించి మీకు ఇప్పటి వరకూ చెప్పలేదు.. మీరు తొందరలోనే తెలుసుకుంటారు. ఈ సినిమాలో 11 మంది నటులకు విజిల్ మూమెంట్స్ ఉంటాయి. అందరికీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ హిప్ ఆప్ తమిళ.. ఈ సినిమాలో నాకంటే పెద్ద హీరో. తమిళ ఐడియాను మేము తీసుకుని బెటర్‌గా తీయడానికి ప్రయత్నించాం. తీశామని నమ్ముతున్నా. హిప్ ఆప్ అంత పెద్ద అండగా ఈ సినిమా మొత్తం ఉన్నాడు. ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చింది. మీరంతా సినిమా ఎంజాయ్ చేయబోతున్నారు’’ అని తెలిపాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా తప్పక హిట్ అవుతుందని చిత్ర యూనిట్ బలంగా విశ్వసిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments