గ్రాండ్‌గా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ ప్రి రిలీజ్ ఈవెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్రసీమలో హాకీ స్పోర్ట్స్ నేపథ్యంతో రూపొందిన తొలి సినిమా ఏ1 ఎక్స్‌ప్రెస్. యంగ్ హీరో సందీప్ కిషన్ హాకీ క్రీడాకారుడిగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యింది. ఈ నెల 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ పోతినేని పాల్గొన్నాడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.
సందీప్ కిషన్ నటిస్తోన్న 25వ చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్. న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ హీరో సందీప్ కిషన్‌కి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టర్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషెక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు.
భారతదేశం తరఫున ఆడాలని కలలు కనే యువ హాకీ ఆటగాడిగా సందీప్ కిషన్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అతడి ప్రేమికురాలిగా లావణ్య త్రిపాఠి కూడా హాకీ ప్లేయర్ కావడం విశేషం. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన తొలి సినిమా కావడంతో అంచనాలు సైతం భారీగానే ఉన్నాయి. గత కొంతకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్‌కు ఈ సినిమా బాగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments