మరో నాలుగు రోజుల్లో రాబోతున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న 25వ చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోంది. హాకీ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్‌కి అత్యంత కీలకం. ఇటీవలి కాలంలో మంచి సక్సెస్ కోసం సందీప్ ఎదురు చూస్తున్నాడు. అది ఈ సినిమాయే అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మార్చి 5న ఈ సినిమా విడుదల కాబోతోంది. అంటే ఈ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్‌తో కనిపించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
తెలుగులో హాకీ బేస్డ్ మూవీ కూడా ఇప్పటి వరకూ రాకపోవడంతో సినిమా ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠిల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. దీంతో సందీప్ కిషన్ కెరీర్లో అత్యధికంగా 8.5 మిలియన్ వ్యూస్ పొందిన ట్రైలర్‌గా ఇది నిలిచింది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ అందించిన పాటలు ఇప్పటికే సంగీత ప్రియులను అమితంగా అలరిస్తున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments