టీటీడీ తాత్కాలిక ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డి

  • IndiaGlitz, [Wednesday,April 28 2021]

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని తాత్కాలికంగా.. ఈవో కార్యకలాపాలు చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డిని ఇప్పటికే..
స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. జవహర్‌రెడ్డిని తాడేపల్లి నుంచి విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో బాధ్యతలను తాత్కాలికంగా అదనపు ఈవో ధర్మారెడ్డికి ప్రభుత్వం అప్పగించింది.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే 104 కాల్‌సెంటర్‌‌ను ఏర్పాటు చేసింది. అలాగే స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ చైర్మన్‌గా టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి హెడ్‌క్వార్టర్స్‌ను తాత్కాలికంగా తిరుపతి నుంచి వెలగపూడి సచివాలయానికి మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

More News

సేమ్ టు సేమ్ పెంపుడు కుక్కలతో సమంత, అనసూయ..

కుక్కలంటే అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మెగాస్టార్‌ని ఢీకొట్టబోతున్న స్టైలిష్ స్టార్?

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎవరూ థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి.

కరోనా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో ఈ మహమ్మారికి చెక్ పెట్టే కార్యక్రమం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.

అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభణ కొనసాగిస్తోంది. రోజుకు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురి చేస్తోంది.

దిల్ రాజుకు పవన్ మళ్లీ గ్రీన్ సిగ్నల్.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఏ దర్శక నిర్మాతకు ఉండదు? నిర్మాత దిల్ రాజుకైతే పవన్‌తో సినిమా చేసేందుకు చాలా కాలమే పట్టింది.