వైవీ సుబ్బారెడ్డికి ఒక షాక్.. గుడ్ న్యూస్!?
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీకి పెద్ద దిక్కు.. తన సొంత బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి షాకివ్వనున్నారా..? టికెట్ ఇచ్చేది లేదని బాబాయ్‌కి తేల్చిచెప్పేశారా..? దీంతో వైవీ అలకబూనారా.. అందుకే ఇటీవల జరిగిన గృహ ప్రవేశానికి ఆయన హాజరుకాలేదా..? అంటే తాజా పరిణామాలను బట్టి ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది.
పక్కింటి పుల్లగూర రుచిగా ఉంటుందన్న చందంగా తన సొంతింట్లోని వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా.. టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్న సీనియర్ నేత, సుధీర్ఘ పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి వైసీపీ నేతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారట. పలువురు నేతలు ఇదేంటి సార్.. ఇలా సడన్ షాక్ ఇచ్చారని అడగ్గా మీరు ఏదేదో ఊహించుకోకండి.. బాబాయ్‌కు ఏమివ్వాలో తనకు తెలుసని ఆయన చెప్పారట.
గుడ్ న్యూస్ ఇదీ..
బాబాయ్ బదులు మాగుంట టికెట్ ఇచ్చి ఆయన పార్లమెంట్‌కు పంపి.. వైవీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకుని కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. బిర్యానీ ఉండగా.. పులిహోర కోసం పోటీపడటం ఎందుకని వైవీ సుబ్బారెడ్డి కూడా మరో మాట ఆలోచించకుండా.. అంతేకాదు ఏ నియోజకవర్గం అనేది అడగకుండానే ఓకే అనేశారట. దీంతో ఎప్పట్నుంచో అసంతృప్తితో రగిలిపోతున్న వైవీ ముఖంలో చిరునవ్వు వచ్చిందట. సో వైసీపీ గెలిస్తే వైవీ పేరుకు ముందు ఇన్నాళ్లు ఉన్న ఎంపీ, మాజీ ఎంపీ పోయి.. మంత్రి అనే తోక చేరనున్నదన్న మాట.
బంపర్ ఆఫర్‌ను కాదనుకొని..
కాగా.. మాగుంటకు చంద్రబాబు భారీ ఆఫర్ ఇచ్చేశారు.. ఒంగోలు పార్లమెంట్ మొదలుకుని నెల్లూరు పార్లమెంట్.. అసెంబ్లీ ఏది కోరుకున్నా సరే ఇచ్చేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చేశారట. అయితే అన్నీ ఉన్నా అదేదో తక్కువైనట్లు మాగుంట మాత్రం రాష్ట్రంలో వైసీపీ ఫ్యాన్ గాలి వీస్తుండటంతో అక్కడికెళ్లి సేదతీరుదామని భావిస్తున్నారట.
మొత్తానికి చూస్తే.. ఇన్ని రోజులుగా వైవీపై మీడియాలో వచ్చిన వరుస కథనాలకు.. రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడినట్లైంది. ఇక మిగిలింది.. జగన్ చేయాల్సిందల్లా వైవీ సుబ్బారెడ్డికి ఏదో ఒక అసెంబ్లీ సీటివ్వడం.. మాగుంటకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడమే. అయితే సుబ్బారెడ్డి ఏ మాత్రం గెలిచి మంత్రి అవుతారో.. మాగుంట పార్టీలోకి వచ్చి వైసీపీ జెండాను ఏ మాత్రం ఎగరేస్తారో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com