మాటకు కట్టుబడి ఉన్నాం.. ఏశాట్ శకలాలు మండిపోతాయ్!
- IndiaGlitz, [Friday,April 05 2019]
భారత్.. అంతరిక్షంలో జరిపే ప్రయోగాల్లో ఇప్పటి వరకు సక్సెస్ అయినవి కోకొల్లలు ఉన్నాయి. ఈ ప్రయోగాలు పూర్తయిన తర్వాత అంతరిక్షంలో పెద్ద ఎత్తున వ్యర్థ పదార్థాలన్నీ నిల్వ ఉండిపోతాయి.! మరోవైపు భారత్ ఉపగ్రహ విధ్వంసక ప్రయోగం(ఏశాట్)తో భూ వాతావరణంలో ప్రవేశించి మండిపోతాయని అమెరికా రక్షణ విభాగం అయిన పెంటగాన్ తెలిపింది. కాగా ఇప్పటికే పలుమార్లు ఏశాట్‌తో వెలువడ్డ వాటి వల్ల అంతరిక్ష కేంద్రానికి పెను ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే పలుమార్లు నాసా ఆందోళన వ్యక్తం చేసినవిషయం విదితమే. అయితే ఇదే తరుణంలో అటు పెంటగాన్ కూడా చెప్పడం గమనార్హం.
అయితే.. ఈ వ్యవహారంపై గత నెలలో అమెరికా రక్షణ కార్యదర్శి ఒకరు మీడియాతో మాట్లాడుతూ అందరూ అనుకుంటున్నట్లుగా భారత్ చేసిన ప్రయోగంతో ఉపగ్రహాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని తేల్చిచెప్పారు. అయితే తాజాగా పెంటగాన్ ప్రకటనకు గతంలో చేసిన ప్రకటనతో అసలు నిజమేంటో జనాలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో తాము చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. దీంతో కాసింత ఆందోళన తప్పినట్లైంది. కాగా.. 800కి.మీ ఎత్తులో దాదాపు 3000 శకలాలు ఏర్పడ్డట్లు ఓ అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది. అయితే వీటన్నింటినీ తొలగించడానికి అంతరిక్ష భద్రత, రక్షణ విషయంలో భారత్‌తో ఉన్న వ్యూహాత్మక బంధాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తామని అమెరికా స్పష్టం చేసింది. అయితే ఈ శకలాలు మండిపోవడానికి ఎంత సమయం పడుతుంది..? అనే విషయాలు మాత్రం అమెరికా వెల్లడించలేదు.