సూపర్ స్టార్ కు అరుదైన గౌరవం
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరగబోయే గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఐఎఫ్ఎఫ్ఐ) అవార్డ్స్ 2019లో ఆయనకు `ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డ్` దక్కనుంది. ఈ అవార్డ్‌ను రజనీకాంత్‌కు ఇస్తున్నట్లు తెలియజేయడం ఆనందంగా ఉందని ప్రకాష్ జవదేకర్ అధికారికంగా ప్రకటించారు. ``ఇన్నేళ్లు సినిమా ఇండస్ట్రీకి రజనీకాంత్ చేసిన సేవలకు ఈ అవార్డును ఆయనకు ఇస్తున్నాం`` అని తెలియజేశారు. ఈసారి జరుగుతున్నది 50వ ఐఎఫ్ఎఫ్ఐ అవార్డ్స్ కావడంతోప్రభుత్వం ఈ అవార్డ్స్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.
వారం రోజుల పాటు జరగుతున్న ఈ అవార్డ్స్ వేడుకలో వివిధ దేశాలకు చెందిన 250 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఫ్రెంచ్ నటుడు ఇస్‌బెల్లె హప్పర్ట్‌కు లైఫ్ అచీవ్ మెంట్ అవార్డును ఇస్తున్నారు. ఈ వేడుకల్లో 50 మహిళా దర్శకులు తెరకెక్కించిన 50 సినిమాలను కూడా ప్రదర్శించన్నారు. రష్యా భాగస్వామ్యంలో ఈ అవార్డు వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజసింది. అమితాబ్ బచ్చన్ నటించిన ఏడెనిమిది చిత్రాలను ఈ వేడుకల్లో ప్రదర్శించనున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments