NTR:ఎన్టీఆర్ స్థలం వివాదం కేసులో కొత్త ట్విస్ట్.. తారక్ టీం ఏం చెప్పిందంటే..?

  • IndiaGlitz, [Friday,May 17 2024]

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ స్థలం విషయంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై తారక్ టీం తాజాగా స్పందించింది. 2013లోనే ఈ ప్రాపర్టీని ఎన్టీఆర్ కొన్నారని.. కానీ దీనికి సంబంధించిన వార్తలలో ఎన్టీఆర్ పేరు ఉపయోగించకుండా ఉండాల్సింది అంటూ కూడా కోరుతున్నారు. ఈ వివాదంతో ఎన్టీఆర్‌కు సంబంధం లేదని తేల్చిచెప్పారు. అసలు ఏం జరిగిందంటే.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్న 681 చదరపు గజాల స్థలం విషయంలో వివాదం నెలకొంది. తారక్ చెబుతున్న వివరాల ప్రకారం... 2003లో సుంకు గీత అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు.

చట్టప్రకారం అన్ని అనుమతులను పొందిన తర్వాత ఏడాది క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఆ భూమిని ఎన్టీఆర్‌కు అమ్మిన వ్యక్తులు 1996లోనే దాన్ని తమ వద్ద తనఖా పెట్టి రుణం పొందారని ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు డెట్ రికవరీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది.

దీంతో ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే ట్రైబ్యునల్ తీర్పిచ్చిందని.. ఈ ఆదేశాల్ని రద్దు చేయాలని ఎన్టీఆర్ తాజాగా తెలంగాణ కోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం గరువారం విచారణ చేపట్టిందని సమాచారం. ట్రైబ్యునల్ ఆర్డర్ కాపీ అందుబాటులో లేకపోవడంతో తమకు కొంత సమయం కావాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశించింది.

ఇక తారక్ సినిమాల విషయానికొస్తే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' చిత్రం ఇటీవల గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే ఫస్ట్ సింగల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోసర్లు, గ్లింప్స్ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్‌ విలన్‌గా కనిపించబోతున్నాడు. మరో సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారట.

రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. అందులో మొదటి భాగం 'దేవర పార్ట్-1' దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. అలాగే 'వార్‌2'తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీలోనూ నటించనున్నాడు.

More News

Chandrababu, Lokesh:చంద్రబాబు, లోకేష్‌కు షాక్‌.. వ్యక్తిగత దాడి అని తేల్చిన పోలీసులు

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, తాడిపత్రి, తిరుపతి, మరికొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

దాడులు జరగకుండా చూడాలి.. సీఎస్, డీజీపీకి ఈసీ, హైకోర్టు ఆదేశాలు

ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల కట్టడికి ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ

BRS Party: పార్లమెంట్ ఎన్నికల్లో కారు జోరు తగ్గిందా.. పెరిగిందా..? తేడా వస్తే మాత్రం..?

తెలంగాణలో 17 స్థానాలకు పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు.

Rain in Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. బయటకు రావొద్దని హెచ్చరిక..

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. ‌‌మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా ఉరుములు,

ఏపీలో భారీగా పెరిగిన పోలింగ్.. ఆ పార్టీకే ప్లస్ కానుందా..?

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదుకావడం విశేషం. గత ఎన్నికలతో పాటు ఇప్పటి వరకు నాలుగు దశల పోలింగ్‌తో పోల్చుకుంటే