క‌ర్నాట‌క‌లో స‌రికొత్త‌గా క‌బాలి ప్ర‌ద‌ర్శ‌న‌

  • IndiaGlitz, [Tuesday,July 19 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రం ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే...క‌బాలి చిత్రం గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. విమానాల పై సైతం ప్ర‌మోష‌న్ చేసి క‌బాలి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే...క‌ర్నాట‌క‌లో క‌బాలి చిత్రాన్ని స‌రికొత్త‌గా ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఇంత‌కీ కొత్త‌గా ఏం చేయ‌నున్నారంటే...బెంగుళూరులోని ఫైవ్ స్టార్ హోట‌ల్లో క‌బాలి చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించేలా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు మ‌ల్టీఫ్లెక్స్ లో క‌బాలి ప్ర‌ద‌ర్శించే హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న ల‌హ‌రి సంస్థ అధిప‌తి ల‌హ‌రి వేలు తెలియ‌చేసారు. ల‌లిత్ అశోక‌, రాయ‌ల్ ఆర్కిడ్, జె.డ‌బ్ల్యు మారియ‌ట్, క్రౌన్ ప్లాజా హోట‌ల్లో మూడు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేసారు. భోజ‌నంతో పాటు టిక్కెట్ ధ‌ర వెయ్యికి పైగా ఉంటుంద‌ని స‌మాచారం. భ‌విష్య‌త్ లో క‌న్న‌డ సినిమాల‌ను కూడా ఇలాగే హోట‌ల్లో ప్ర‌ద‌ర్శిస్తార‌ట‌.