మనుషుల్లో దేవుడు అంటే ఇతనే...
- IndiaGlitz, [Saturday,July 23 2016]
గ్రూప్ డాన్సర్ గా కెరీర్ ప్రారంభించి...కొరియోగ్రాఫర్ గా, కథానాయకుడు గా, దర్శకుడుగా, సంగీత దర్శకుడిగా...ఇలా తను ప్రవేశించిన ప్రతి శాఖలో విజయం సాధించిన మల్టీ టాలెంటెడ్ పర్సన్ రాఘవ లారెన్స్. ఆపదలో ఉన్న వారికి అండగా నేనున్నాను అంటూ ఎప్పుడూ ముందుండే లారెన్స్ మరోసారి ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు 128 మందికి పైగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించిన లారెన్స్ తాజాగా ఓ చిన్నపిల్లాడుకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించనున్నాడు.
ఈ సందర్భంగా లారెన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ... నా ఫ్యాన్స్ & ఫ్రెండ్స్ ఈ సోమవారం అభినేష్ అనే మూడు సంవత్సరాల పిల్లాడుకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయిస్తున్నాను. ఆపరేషన్ సక్సెస్ కావాలని ప్రార్ధించండి అని కోరారు. ఈ విధంగా సాయం చేసే ఆర్ధిక బలం చాలా మందికి ఉన్నా...అతి కొంత మంది మాత్రమే సాయం చేయడానికి ముందుకు వస్తారు. అలాంటి వారిలో ఎప్పుడూ ముందుండే గొప్ప మానవతావాది లారెన్స్. సో...ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుంటూ ఎంతో మంది జీవితాలకు వెలుగు ప్రసాదిస్తున్న లారెన్స్ మనుషుల్లో దేవుడు అనే పదానికి అసలైన నిర్వచనం అనడంలో ఎలాంటి సందేహం లేదు.