Ankura Hospital:హైదరాబాద్లోని అంకుర ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిమల్కాపూర్లోని అంకుర ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఆరు అంతస్తులు ఉన్న ఆ భవనంలో మంటలు చెలరేగి మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఆసుపత్రిలో చాలామంది రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే భవనం ఆరో అంతస్తులో ఆసుపత్రిలో పనిచేసే నర్సులు నివాసం ఉంటున్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో నర్సులు భయంతో హుటాహుటిన కిందకు వచ్చేశారు. కానీ తమ సర్టిఫికెట్లు మొత్తం ఆసుపత్రిలోనే ఉన్నాయని విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో ఎంత మంది రోగులు ఉన్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మంటలు ఎగిసిపడటంతో ఆసుపత్రి పరిసరాల్లో దట్టమైన పొగ అలముకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు వరుస అగ్నిప్రమాదాలు జరగడంపై నగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments