బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడులోని కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్‌లో బాణాసంచా కర్మాగారంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కర్మాగారంలో పని చేస్తున్న ఐదుగురు మహిళలు మృతి చెందగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పేలుడు ధాటికి గిడ్డంగి పూర్తిగా ధ్వంసమైంది. ఘటనపై కడలూరు ఎస్పీ విచారణకు ఆదేశించారు. తమిళనాడులో మార్చిలో సైతం ఓ పేలుడు సంభవించింది. మార్చిలో విరుదునగర్ జిల్లా సిప్పిపారెయ్ దగ్గర బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది గాయపడ్డారు. ఇప్పుడు కోయిల్‌లో పేలుడు సంభవించడం అక్కడి ప్రజానీకాన్ని భయాందోళనకు గురి చేస్తోంది.
తమిళనాడు బాణా సంచా తయారీకి పెట్టింది పేరు. 1908లో షణ్ముగ అయ్యర్ నాడార్ అనే వ్యక్తి 1908లో 30 మందితో చిన్నపాటి బాణాసంచా తయారీ కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. ఈ కర్మాగారాన్ని పరిశీలించిన పలువురు ఇదే వ్యాపారాన్ని ఎంచుకున్నారు. దీంతో లక్షలాది మందికి ఉపాధి దొరకడంతో పాటు తమిళనాడు బాణాసంచా తయారీకి పేరుగాంచింది. బాణాసంచా తయారీలో ప్రఖ్యాతి గాంచిన శివకాశి సైతం తమిళనాడులోనే ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout