మహేష్ - విజయ్ లతో 350 కోట్ల భారీ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ - కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లతో ఓ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు డైరెక్టర్ సుందర్ సి ప్లాన్ చేస్తున్నట్టు చెన్నై సమాచారం. సంగీత సంచలనం ఎ.ఆర్.రెహమాన్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు కమల్కణ్ణన్ తదితర హేమాహేమీలు ఈ చిత్రానికి వర్క్ చేయనున్నారు. అయితే..ఇది మల్టీస్టారర్ మూవీ కాదు. తెలుగు వెర్షెన్ లో మహేష్ బాబు, తమిళ వెర్షెన్ లో విజయ్ నటిస్తే బాగుంటుంది అనేది డైరెక్టర్ సుందర్ సి ఆలోచన.
ఇటీవల మహేష్, విజయ్ ఇద్దరిని కలిసి కథ వినిపించారని కోలీవుడ్ సమాచారం. హిందీలో కూడా ఈ చిత్రాన్ని తీయాలనుకుంటున్నారట. అయితే బాలీవుడ్ హీరోలు ఎవరికి ఇంకా ఈ కథ వినిపించలేదు. ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ నిర్మించనుంది. ఈ సంస్థకు ఈ చిత్రం వందవ చిత్రం. అందుచేత ఈ చిత్రాన్నిదాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది. అయితే..మహేష్, విజయ్ ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించారా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com