నెలకో హ్యాట్రిక్ డైరెక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
తొలి చిత్రంతో సినీ పరిశ్రమలో విజయం అందుకోవడం దర్శకులకి ఎంత ముఖ్యమో.. ద్వితీయ విఘ్నాన్ని అధిగమించడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది దర్శకులు మొదటి సినిమాతో విజయాన్ని అందుకున్నా.. రెండో చిత్రంతో చతికిల పడుతూ ఉంటారు. అయితే ఈ ఏడాదిలో ముగ్గురు దర్శకులు.. ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటుకుని హ్యాట్రిక్ వైపు అడుగులు వేస్తున్నారు. విశేషమేమిటంటే.. ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు వరుస నెలల్లో సందడి చేయనున్నాయి.
కాస్త వివరాల్లోకి వెళితే.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’లతో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధి. మూడో చిత్రంగా నాని ద్విపాత్రాభినయంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాని తెరకెక్కించారాయన. ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. అలాగే.. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న కళ్యాణ్ కృష్ణ.. ప్రస్తుతం రవితేజ, మాళవిక శర్మ జంటగా ‘నేల టిక్కెట్టు’ రూపొందిస్తున్నారు. ఈ సినిమా మే 24న విడుదల కానుంది. అదేవిధంగా.. తొలి చిత్రం ‘కార్తికేయ’, మలి చిత్రం ‘ప్రేమమ్’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చందు మొండేటి.. ప్రస్తుతం హ్యాట్రిక్ చిత్రంగా నాగ చైతన్య కాంబినేషన్‌లో ‘సవ్యసాచి’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏప్రిల్, మే, జూన్.. ఇలా వరుసగా మూడు నెలల్లో హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న ఈ దర్శకుల్లో.. ఎవరికి ఆ హ్యాట్రిక్ సొంతమవుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com