YSRCP Social Media: లండన్లో ఘనంగా వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం..భారీగా హాజరైన కార్యకర్తలు
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రం సంక్షేమం కోసం సీఎం జగన్ అనుక్షణం ఎంతో కష్టపడుతున్నారని సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి తెలిపారు. యూకే వైసీపీ కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, వైసీపీ నాయకులు ఓబుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైసీసీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం లండన్లో ఘనంగా జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ రాష్ట్ర మీడియా మరియు సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి, APNRTS అధ్యక్షులు మేడపాటి వెంకట్, APSSDC రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, వైసీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్ హాజరయ్యారు. వీరితో పాటు యూకే నలుమూలల నుంచి భారీగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
వైనాట్ 175 టార్గెట్గా కలిసి పనిచేద్దాం..
ఈ సమావేశంలో సజ్జల భార్గవ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి క్షణం సీఎం జగన్ కష్టపడుతున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే కాదు అవినీతిపరుల గుండెల్లో సింహ స్వప్నంగా జగనన్న నిలిచారని పేర్కొన్నారు.
దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు మనం అందరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఏపీలో గ్రామాలను ఎంత అభివృద్ధి చేశారంటే మీరందరూ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చూస్తే ఆశ్చర్య పోతారని చెప్పారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో ఎలా పని చేయాలో దిశానిర్దేశం చేశారు.
వైనాట్ 175 టార్గెట్గా అందరం కలిసి పని చేద్దామని మీకు ఏ కష్టం వచ్చినా తాను ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com