ఓ గ్యాంగ్ నాపై దుష్ప్రచారం చేస్తోంది: ఏ ఆర్ రెహమాన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు దక్షిణాది, ఉత్తరాది సినీ ప్రేక్షకులకు ఎ.ఆర్.రెహమాన్ ఇండియన్ మ్యూజిషియన్. కానీ ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న తర్వాత ప్యాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టరే కాదు.. ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయ్యారు. అయితే ఆస్కార్ అవార్డ్స్ వచ్చిన తర్వాత రెహమాన్ మన సినిమాలు చేసే సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ విషయం గురించి ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ గ్యాంగ్ పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తుందని చెప్పడం గమనార్హం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా దిల్ బేచారాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా దర్శకుడు ముఖేష్ చబ్రా రెహమాన్‌ను కలిసి సంగీతం చేసిన పెట్టమని అడిగినప్పుడు రెండు రోజుల్లో రెహమాన్ నాలుగు ట్యూన్స్‌ను రెడీ చేసి ఇచ్చాడట.
పని పూర్తయిన తర్వాత ముఖేష్ చెప్పిన విషయం విన్న ఎ.ఆర్.రెహమాన్ షాకయ్యారట. అదేంటంటే.. రెహమాన్‌ను ముఖేష్ కలవాలని అనుకున్నప్పుడు ఆయనెందుకు? వద్దు అని చాలా మంది చెప్పారట. కానీ ముఖేష్ పెద్దగా పట్టించుకోకుండా రెహమాన్ దగ్గరకు వచ్చాడట. ఇలా కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇంటర్వ్యూలో రెహమాన్ వాపోయారు. తను కంటెంట్ ఉన్న ఎలాంటి సినిమాకైనా సంగీతాన్ని అందిచండానికి సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా రెహమాన్ తెలిపారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో నెపోటిజంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎ.ఆర్.రెహమాన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం వచ్చాయి. రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ వద్దకే వద్దని అంటున్నారంటే.. ఇక చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్ పడుతున్న ఇబ్బందులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments